Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ (Allu Arjun)కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో భారీ సక్సెస్ ని సాధించిన ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక మీదట చేయబోయే సినిమాలతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకొని ఎలాగైనా సరే ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్(Trivikram) డైరెక్షన్ లో సినిమా చేస్తున్న ఆయన ఈ సినిమా మీదనే పూర్తి ఫోకస్ ని పెట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటికే తన మెకోవర్ లో కూడా చేంజేస్ చేసుకొని చేసి చూపించాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీద పోతుంది అంటూ సినిమా మేకర్స్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ సూపర్ సక్సెసులైతే దక్కుతూ ఉంటాయి. అందులో అల్లు అర్జున్ కూడా ఒకరనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఓకేత్తయితే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు మరోకెత్తుగా మారబోతున్నాయి. ఎందుకంటే పాన్ ఇండియాలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు.
అలాగే పుష్ప 2 (Pushpa 2) సినిమాతో 1900 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాడు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత రాబోయే సినిమాల మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి. అందువల్లే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా చేసి సక్సెస్ ని సాధిస్తే తప్ప ఏ కొంచెం అతి చేసినా కూడా సినిమా అనేది డిజాస్టర్ బాట పట్టే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ కి ఫేవరెట్ హీరో ఎవరు అంటూ చాలామంది కామెంట్లైతే చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ కి ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeev)… ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో తెలియజేశారు… చిన్నప్పటి నుంచి తన సినిమాలు చూసుకుంటు పెరిగాను కాబట్టి మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని చెపుతూ ఉంటాడు.
ఆయన కూడా చిరంజీవి మాదిరిగానే కూడా ఇండస్ట్రి లో స్టార్ హీరో అవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఇండస్ట్రీ లో చాలా వరకు కష్టపడుతున్నాననని అల్లు అర్జున్ గతంలో చెప్పాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి లాంటి టాప్ హీరో ఏ రేంజ్ లో ఉన్నాడో అల్లు అర్జున్ ఆ రేంజ్ ను టచ్ చేశాడు. కాబట్టి అల్లు అర్జున్ ప్రస్తుతం హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తోంది…