https://oktelugu.com/

Allu Arjun : స్పృహ లోకి వచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ్..కానీ అతని పరిస్థితిని చూస్తే ఏడుపుని ఆపుకోలేరు..పగోడికి కూడా ఇలాంటి కష్టం రావొద్దు!

హైదరాబాద్ సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసిలాటలో రేవంతి అనే మహిళ మృతి చెందిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 21, 2024 / 01:41 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : హైదరాబాద్ సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసిలాటలో రేవంతి అనే మహిళ మృతి చెందిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ కొడుకు శ్రీతేజ్ కూడా తీవ్ర గాయాలపాలై కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. నిన్న మొన్నటి వరకు క్రిటికల్ గా ఉన్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి, ఇప్పుడు నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. నిన్న సాయంత్రం శ్రీతేజ్ కి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని విడుదల చేస్తూ ‘ప్రస్తుతానికి శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వెంటిలేటర్ మీద అతని చికిత్స అందిస్తున్నాం. చికిత్సకు అతను సహకరిస్తున్నాడు కానీ, మధ్యలో ఆ అబ్బాయికి ఫిట్స్ వస్తున్నాయి. కళ్ళు కూడా తెరుస్తున్నాడు, చూడగల్తున్నాడు కానీ, ఎవ్వరినీ గుర్తు పట్టలేకపోతున్నాడు’ అంటూ శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గుర్తించి వైద్యులు మీడియా కి బులిటెన్ ని విడుదల చేసారు.

    ఎవరినీ గుర్తు పట్టలేకపోవడం అంటే, ఆ అబ్బాయి చెల్లిని, తండ్రిని కూడా గుర్తు పట్టని స్థాయిలో ఉన్నాడట. పాపం ఆ బిడ్డకి ఇప్పటి వరకు తన తల్లి చనిపోయింది అనే విషయం కూడా తెలియదు. ఒకవేళ ఆమె ఫోటో ని చూసినా కూడా గుర్తుపట్టలేడు. ఏ పాపం చెయ్యని ఆ బిడ్డకి ఇలాంటి పరిస్థితి ఆ దేవుడు ఎందుకు కలిగించాడో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కనీళ్ళు పెట్టుకుంటున్నారు. పూర్తి స్థాయి చికిత్స అయిపోయిన తర్వాత అయినా, శ్రీ తేజ్ మామూలు మనిషి అవ్వాలని, అతనికి అన్ని విధాలుగా అల్లు అర్జున్ కుటుంబం అండగా నిలబడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇటీవలే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా కిమ్స్ ఆసుపత్రికి చేరుకొని, శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లతో ఆరా తీసి, అతనికి ఏ విధమైన సహాయసహకారాలు అవసరమున్నా మేము తోడుగా ఉంటామని చెప్పిన సంగతి తెలిసిందే.

    ఈ ఘటనపై అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యాడు. సంధ్య థియేటర్ మూతపడే ప్రమాదం కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు ఈ ఘటనపై చాలా సీరియస్ గా ఉన్నారు. అల్లు అర్జున్ మా మాటలు లెక్క చేయకుండా ఇక్కడికి రావడం వల్లే ఇలా జరిగిందని, అతనికి కచ్చితంగా శిక్ష విధించాల్సిందే అనే ధోరణితో ముందుకు పోతున్నారు. ప్రస్తుతం మధ్యంతరం బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్ కి బెయిల్ రద్దు చెయ్యాలంటూ తెలంగాణ పోలీసులు సుప్రీమ్ కోర్టు కి వెళ్ళబోతున్నారు. అంతే కాకుండా సంధ్య థియేటర్ యాజమాన్యం కి మీకు లైసెన్స్ ఎందుకు రద్దు చెయ్యకూడదో కారణం చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు అందించారు. పది రోజుల్లోపు సమాధానం చెప్పకపోతే లైసెన్స్ ని రద్దు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసారు. రాబోయే రోజుల్లో ఈ ఘటన ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.