https://oktelugu.com/

Breaking News : రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ మరో భారీ విరాళం..ఇన్ని కోట్లు ఇస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు!

సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ విరాళం అందచేసాడు. ఇప్పటికే ఆయన పాతిక లక్షల రూపాయిలను విరాళం గా ప్రకటించి అందులో 10 లక్షలు డీడీ రేవతి భర్త భార్గవ్ కి అందించారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 25, 2024 / 03:39 PM IST

    Allu Arjun

    Follow us on

    Breaking News : సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ విరాళం అందచేసాడు. ఇప్పటికే ఆయన పాతిక లక్షల రూపాయిలను విరాళం గా ప్రకటించి అందులో 10 లక్షలు డీడీ రేవతి భర్త భార్గవ్ కి అందించారు. ఇప్పుడు ఏకంగా రెండు కోట్ల రూపాయిల విరాళం ని అందిస్తూ అల్లు అర్జున్ తన గొప్ప మనసుని చాటుకున్నాడు. కాసేపటి క్రితమే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ హాస్పిటల్ కి చేరుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసిన ఆయన, అనంతరం రెండు కోట్ల రూపాయిల చెక్ ని భార్గవ్ చేతికి అందించాడు. ఈ రెండు కోట్ల రూపాయలలో కోటి రూపాయిలు అల్లు అర్జున్ వంతు కాగా, 50 లక్షల రూపాయిలు డైరెక్టర్ సుకుమార్, మరో 50 లక్షలు పుష్ప 2 నిర్మాతలది.

    రెండు రోజుల క్రితమే పుష్ప 2 నిర్మాతలు శ్రీ తేజ్ తండ్రి భార్గవ్ చేతికి 50 లక్షల రూపాయిల చెక్ ని అందించాడు. ఇప్పుడు మరో 50 లక్షలు అదనంగా అందించాడు. అంటే పుష్ప నిర్మాతల వైపు నుండి కోటి రూపాయిలు, అల్లు అర్జున్ నుండి కోటి రూపాయిలు, సుకుమార్ నుండి 50 లక్షలు, ప్రారంభం లో ఇచ్చిన పది లక్షల తో కలిపి మొత్తం పుష్ప 2 టీం నుండి రెండు కోట్ల 60 లక్షల రూపాయిల విరాళం అందింది అన్నమాట. ఇది కాకుండా ప్రభుత్వం తరుపున పాతిక లక్షల రూపాయిలు కూడా భార్గవ్ కుటుంబానికి అందింది. శ్రీ తేజ్ వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. నిన్న సాయంత్రం దిల్ రాజు శ్రీ తేజ్ ని కలిసి అతని ఆరోగ్య పరిస్థితి పై ఆరాలు తీసి కొన్ని కీలక ప్రకటనలు చేసారు.

    ఆయన మాట్లాడుతూ ‘నేను ప్రభుత్వం తరుపున ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉన్నాను. ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి నేనే వారధిగా ఉండాలని సీఎం గారు నన్ను ఈ పదవి లో కూర్చోబెట్టారు. సీఎం గారు నాకు భార్గవ్ కి ఇండస్ట్రీ లో ఎదో ఒక ఉద్యోగం ఇప్పించమని కోరారు. కచ్చితంగా భార్గవ్ ని ఇండస్ట్రీ లోకి తీసుకుంటాము. అతనికి మంచి జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తాము. త్వరలోనే ఇండస్ట్రీ లోని పెద్దలందరూ కలిసి సీఎం గారిని కలవబోతున్నాము. ఈ గ్యాప్ ని పూడ్చేందుకు అన్ని విధాలుగా నేను ప్రయత్నం చేస్తాను’ అంటూ దిల్ రాజు నిన్న ఒక ప్రకటన చేసాడు. ఇది ఇలా ఉండగా నిన్న రాత్రి ప్రెస్ మీట్ ద్వారా రేవతి భర్త ,శ్రీతేజ్ తండ్రి భార్గవ్ అల్లు అర్జున్ మీద వేసిన కేసుని వెనక్కి తీసుకుంటామని అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.