Allu Arjun With Warner: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న టాలీవుడ్ సినిమాల్లో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కచ్చితంగా కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాం, పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో మన తెలుగోడు జెండా పారబోతున్నాడు అని అనిపించేలా చేసిన ప్రాజెక్ట్స్ లో ఒకటి అల్లు అర్జున్(Icon Star Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా. ఈ సినిమా ప్రకటనే ఒక స్పెషల్ వీడియో ద్వారా తెలిపారు. ఆ వీడియో కి సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది, హాలీవుడ్ తరహా స్టాండర్డ్స్ తో ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో తెరకెక్కించబోతున్నామో ఒక చిన్న గ్లింప్స్ లాగా ఆ వీడియో అనిపించింది. కేవలం అల్లు అర్జున్ కి సంబంధించిన వీడియో నే కాదు, హీరోయిన్ దీపికా పదుకొనే కి సంబంధించిన వీడియో కూడా చాలా క్రేజీ గా అనిపించింది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా అని చెప్పకనే చెప్తున్నారు మేకర్స్.
Also Read: ‘మిరాయ్’ మూవీ మొట్టమొదటి రివ్యూ..సినిమాలో ప్లస్సులు,మైనస్సులు ఇవే!
‘వార్నర్ బ్రదర్స్'(Warner Brothers) అనే హాలీవుడ్ సంస్థ మీకు తెలుసా..?, ఇప్పటి వరకు ఎన్నో సంచలనాత్మక హాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించిన సంస్థ ఇది. యానిమేషన్ చిత్రాలు, లైవ్ యానిమేషన్ చిత్రాలను కూడా ఈ సంస్థ ద్వారా నిర్మించారు. పలు టీవీ సిరీస్ లు, వెబ్ సిరీస్ లు కూడా వచ్చాయి. అలాంటి సంస్థ తో చేతులు కలపబోతున్నారు అల్లు అర్జున్, అట్లీ. ఈ సినిమా ని హాలీవుడ్ లో గ్రాండ్ గా వార్నర్ బ్రదర్స్ సంస్థ విడుదల చేయబోతుంది. రీసెంట్ గానే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ సంస్థ వార్నర్ బ్రదర్స్ తో చర్చలు కూడా జరిపారట. ఆ చర్చలు సఫలం అయ్యినట్టు సమాచారం. ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తుండగా, విలన్ క్యారక్టర్ లో రష్మిక మందాన నటిస్తున్నట్టు తెలుస్తుంది.
వీళ్ళిద్దరితో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి వారు కూడా ఈ చిత్రం లో నటిస్తున్నారు. త్వరలోనే టాలీవుడ్ హాట్ బ్యూటీ భాగ్యశ్రీ భొర్సే కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్టు సమాచారం.ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు. రెండు ప్రపంచాలు సంబందించిన స్టోరీ గా దీనిని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ చేస్తున్న మూడు క్యారెక్టర్స్ లో ఒకటి సూపర్ హీరో రోల్ అట. సినిమా కాన్సెప్ట్ ఇప్పటి వరకు వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ఎవ్వరూ చూడని విధంగా ఉంటుందని, కచ్చితంగా హాలీవుడ్ సినిమాలతో పోటీ పడే రేంజ్ లోనే ఈ చిత్రం ఉంటుందని సమాచారం.