Tollywood Heroes In Summer: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన సినిమాలు చూడడానికి ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తద్వారా వాళ్లకంటు ఒక స్పెషల్ ఐడెంటిటి ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…మరి ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాలకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. మరి ఇలాంటి క్రమంలోనే ఇక మీదట వాళ్ళు చేస్తున్న సినిమాలన్నీ మంచి ఐడెంటిటిని సంపాదించుకొని ముందుకు దూసుకెళ్లే ప్రయత్నంలో చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ రానటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న మన స్టార్ హీరోలు రాబోయే సినిమాలతో ఎలాంటి విజయాలను అందుకుంటారు. తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతోంది అనేది కీలకంగా మారబోతోంది… ఇప్పటివరకు మన స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలో మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక ప్రస్తుతం ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలందరు సమ్మర్ కి వాళ్ళ సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దసర, సంక్రాంతి సీజన్లను వదిలేసిన మన హీరోలు ఏకంగా సమ్మర్ మీద ఫోకస్ అయితే పెట్టారు.
Also Read: ‘వార్నర్ బ్రదర్స్’ తో అల్లు అర్జున్..హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ కానుందా?
ఇప్పటికే చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా సమ్మర్ కి వస్తుందంటూ అనౌన్స్ చేశారు…అలాగే ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాను కూడా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు…నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘ప్యారడైజ్’ సినిమా కూడా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమా కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది…వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా సమ్మర్ లోనే రాబోతోంది. ఇక రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా సమ్మర్ వరకు ఫినిష్ చేసి సమ్మర్ లోనే బరిలోకి దిగాలనే ప్రయత్నం చేస్తున్నారు…
రవితేజ – కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా సమ్మర్ బరిలో నిలువబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు అన్ని సినిమాలు సమ్మర్ లోనే రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మిగతా రోజుల్లో చిన్న సినిమాలు రిలీజ్ చేసుకుంటే మంచిది అంటూ కామెంట్లు చేస్తున్నారు…