NTR- Allu Arjun: ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ తనదైన శైలిలో బర్త్ డే విషెస్ తెలియజేశారు. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ కి పరిశ్రమలో ఉన్న అతి కొద్ది మంది మిత్రుల్లో అల్లు అర్జున్ ఒకరు. ఒకరినొకరు బావా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కాగా ఎన్టీఆర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు. ట్విట్టర్ కామెంట్ బాక్స్ లో వీరి మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. పార్టీ లేదా పుష్పా? అని ఎన్టీఆర్ కామెంట్ చేయగా… ‘వస్తున్నా’ అని అల్లు అర్జున్ సమాధానం చెప్పారు. ఎవరి రెండు వారిద్దరి చిత్రాలకు సంబంధించిన డైలాగ్స్.
నేడు ఎన్టీఆర్ బర్త్ డే నేపథ్యంలో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశారు. నువ్వు ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలి బావ. హోప్ యూ హావ్ బ్లడీ బర్త్ డే… అంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ తన ప్రియమైన భావ అల్లు అర్జున్ కి ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి. ఎన్టీఆర్ కి టాలీవుడ్ నుండే కాదు బాలీవుడ్ నుండి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ హీరో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా విష్ చేశారు.
హృతిక్ ట్విట్టర్ వేదికగా… హ్యాపీ బర్త్ డే తారక్. ఈ పుట్టినరోజు ఆనందమయం కావాలి. యాక్షన్ ప్యాక్డ్ ఇయర్ రానుంది. యుద్ధ భూమిలో నీ కోసం ఎదురుచూస్తున్నా. నువ్వు సుఖ శాంతులతో ఉండాలి. మనం కలిసే వరకు పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా… అని శుభాంక్షలు చెప్పారు. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కి ఇంత స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పడం విశేషంగా మారింది. హృతిక్ రోషన్ ట్వీట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ బర్త్ డే చాలా ప్రత్యేకంగా మారింది. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచేసింది. దేవర 2024 ఏప్రిల్ 5న సమ్మర్ కానుకగా విడుదల కానుంది. దేవర మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు.
Many many happy returns of the day Bava @tarak9999 . Hope you have a ( bloody 😉 ) good birthday .
— Allu Arjun (@alluarjun) May 20, 2023