Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ఆర్మీ చెందిన వ్యక్తి అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?, ఆయన ఆర్మీ ఆఫీసర్ గా నటించిన చిత్రం ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో అల్లు అర్జున్ మాట్లాడిన కొన్ని మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ప్రతీ సినిమా చేసినప్పుడు పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, అది మామూలే, కానీ ఈ సినిమా చేసినప్పుడు మాత్రం నాకు గౌరవం దక్కింది అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ మూవీ సక్సెస్ ఈవెంట్ లో మూవీ టీం ఇండియన్ ఆర్మీ సైనికులను ముఖ్య అథిధులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అప్పట్లో అల్లు అర్జున్ ఒక మాట ఇచ్చాడు.
Also Read : చేతిలో అరడజను సినిమాలు..కుర్ర హీరోయిన్స్ ని డామినేట్ చేస్తున్న కీర్తి సురేష్!
‘నేను ఇండియన్ ఆర్మీ(Indian Army) లో జాయిన్ అవుతున్నాను సార్. అందుకు కావాల్సిన పేపర్స్ కూడా సబ్మిట్ చేసేసాను , ప్రాసెస్ లో ఉంది’ అంటూ అల్లు అర్జున్ సైనికులకు ఒక మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇండియన్ ఆర్మీ లో చేరాడు కూడా. ఇలా జరగడం కొత్తేమి కాదు. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఇండియన్ ఆర్మీ లో చేరాడు. కొన్నాళ్ళు బోర్డర్ వద్ద ఆయన సైనికులతో కలిసి గడిపిన క్షణాలను ఆయన అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. కొంతమంది ఇడోల్స్ కి ఇండియన్ ఆర్మీ ఇలాంటి అరుదైన గౌరవాన్ని ఇస్తుంది. వాళ్ళు యుద్ధం లో పాల్గొనాలనుకుంటే పాల్గొనచ్చు కానీ ఆర్మీ నుండి కచ్చితంగా పాల్గొనాలి అనే ఒత్తిడి మాత్రం ఉండదు. అలా అల్లు అర్జున్ కూడా ఇండియన్ ఆర్మీ లో ఒక భాగం అయ్యాడు.
అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు చెప్పగా, అది బాగా వైరల్ అయ్యింది. అప్పుడు నెటిజెన్స్ త్వరలో భారత్, పాక్ మధ్య యుద్ధం జరగబోతుంది కదా, అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి పోరాడే అవకాశం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే కాశ్మీర్ లో జరిగిన దుర్ఘటన పై అల్లు అర్జున్ ట్విట్టర్ , ఇన్ స్టాగ్రామ్ మరియు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీస్ అందరూ సంతాపం వ్యక్తం చేసారు కానీ సమంత, రెబెల్ స్టార్ ప్రభాస్ నుండి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదు. దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ చాలా ఫైర్ మీద ఉన్నారు.
Also Read : ‘కేసరి 2’ మొదటి వారం వసూళ్లు..వచ్చిన పాజిటివ్ టాక్ కి ఇంత తక్కువ వసూళ్లా!