Kesari 2 : కొన్ని సినిమాలకు సూపర్ హిట్ టాక్ మొదటి ఆట నుండే వస్తుంది, సినిమా అద్భుతంగా ఉందంటూ రివ్యూస్ వస్తుంటాయి, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టడం లో విఫలం అవుతుంటాయి. రీసెంట్ గా విడుదలైన బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) ‘కేసరి 2′(Kesari 2 Movie) చిత్రం ఆ కోవకు చెందినదే. ‘కేసరి’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో అక్షయ్ కుమార్ నటన అద్భుతమని, స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా ఈమధ్య కాలంలో వచ్చిన బాలీవుడ్ సినిమాలన్నిట్లో బెస్ట్ గా ఉందని, బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతుందని, ఇలా ఎన్నో కామెంట్స్ చేసారు. వసూళ్లు అయితే ప్రస్తుతానికి డీసెంట్ స్థాయిలోనే ఉన్నాయి కానీ, టాక్ కి తగ్గట్టుగా లేవు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read : బాక్స్ ఆఫీస్ వద్ద ‘కేసరి 2’ సెన్సేషన్..ఏకంగా రెండు రెట్లు పెరిగిన వసూళ్లు!
మొదటి రోజు ‘గుడ్ ఫ్రైడే’ సెలవు దినము అయినప్పటికీ ఈ చిత్రానికి కేవలం 7 కోట్ల 84 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చింది.అక్షయ్ కుమార్ రేంజ్ కి ఇది చాలా తక్కువ. ఇక రెండవ రోజు టాక్ ప్రభావం వల్ల 10 కోట్ల 8 లక్షల రూపాయిలు, మూడవ రోజున 11 కోట్ల 70 లక్షల రూపాయిలను రాబట్టింది. ఓపెనింగ్ వీకెండ్ పెద్ద లేకపోయినా, బలమైన పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి, ఫుల్ రన్ లో కచ్చితంగా 200 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబడుతుందని అంతా అనుకున్నారు. కానీ సోమవారం రోజున ఈ చిత్రం ఏకంగా 60 శాతం డ్రాప్స్ ని సొంతం చేసుకొని కేవలం 4 కోట్ల 50 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. కానీ 5 వ రోజున బుక్ మై షో లో ఆఫర్ కారణంగా 5 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది.
అదే విధంగా ఆరవ రోజున 3 కోట్ల 78 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, 7 వ రోజున 3 కోట్ల 60 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా మొదటి వారం ఈ చిత్రానికి 46 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా రెండవ వీకెండ్ భారీ వసూళ్లను నమోదు చేసుకోవాలి. అయితే నేడు కొన్ని సెలెక్టెడ్ సిటీస్ లో బుక్ మై షో యాప్ లో #BOGO కోడ్ ని ఉపయోగించి ఫ్రీ టికెట్స్ ని సంపాదించుకునే అద్భుతమైన అవకాశం రావడంతో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇదే జోరుని వీకెండ్ తో ముగిస్తే కచ్చితంగా ఈ చిత్రానికి క్లోజింగ్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.
Also Read : ‘కేసరి 2’ మొదటి రోజు వసూళ్లు..పాజిటివ్ టాక్ తో ఇంత తక్కువనా?