Allu Arjun : ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసిన హీరో అల్లు అర్జున్ ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక అలాగే పుష్ప ప్రాంచైజ్ గా పుష్ప 2 సినిమా వచ్చి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇక దాంతో తన తదుపరి సినిమాని సైతం భారీగా ప్లాన్ చేసుకుంటున్న అల్లు అర్జున్ ఇకమీదట చేయబోయే సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలపాలనే ఉద్దేశ్యంతో తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఇప్పటికే అట్లీ (Atlee), త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో సినిమాలు చేయడానికి కమిట్ ఆయన ఇద్దరిలో ఎవరితో ముందుగా సినిమా చేస్తాడనే విషయంలోనే సరైన క్లారిటీ అయితే రావడం లేదు… ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల కోసం దాదాపు 350 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒక్క సినిమాకే అంత భారీ రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్ల సినిమాకి భారీగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది…
Also Read : అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ కంటే ఆ దర్శకుడే ఎక్కువా? గురూజీని పక్కన పెట్టడమేంటీ?
ఈ లెక్కన అల్లు అర్జున్ తో సినిమా చేయాలి అంటే దాదాపు 700 నుంచి 800 కోట్ల వరకు బడ్జెట్ అయితే పెట్టాల్సిన అవకాశం అయితే ఉంది. దీని వల్ల టిక్కెట్ రేట్లు కూడా భారీగా పెంచే అవసరమైతే రావచ్చు. క్యాలిక్యులేషన్స్ మధ్యలో 800 కోట్లు పెట్టి అల్లు అర్జున్ తో సినిమా చేస్తే అది భారీ సక్సెస్ ని సాధిస్తే తప్ప 1000 కోట్లకు పైన కలెక్షన్లు వచ్చే అవకాశాలైతే లేవు.
ఇక పుష్ప 2 మీద భారీ బజ్ ఉండడం వల్ల ఆ సినిమా భారీ కలెక్షన్స్ కి రాబట్టింది. ప్రతి సినిమా ఆ మాదిరిగానే సక్సెస్ ని సాధించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని… కాబట్టి ఆయన రెమ్యూనరేషన్ విషయంలో కొంతవరకు తగ్గి తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటే మంచిదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇక ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాను మొదట స్టార్ట్ చేస్తాడు.అలాగే వీటిలో ఈ మూవీ భారీ విజయాన్ని సాధిస్తుందనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం అల్లు అర్జున్ కి నార్త్ లో మంచి క్రేజ్ అయితే ఉంది…