https://oktelugu.com/

Allu Arjun : హాస్పిటల్లో ఉన్న శ్రీ తేజ్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న అల్లు అర్జున్.. ఏం చేశాడో తెలుసా!

'పుష్ప 2 ' ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ లో చోటు చేసుకున్న తొక్కిసిలాట ఘటన రోజురోజుకి ఎంత వివాదాస్పదం గా మారుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

Written By:
  • Vicky
  • , Updated On : December 23, 2024 / 08:12 AM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : ‘పుష్ప 2 ‘ ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ లో చోటు చేసుకున్న తొక్కిసిలాట ఘటన రోజురోజుకి ఎంత వివాదాస్పదం గా మారుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్ గా ఉంది. అల్లు అర్జున్ చాలా బాధ్యతారాహిత్యం గా వ్యవహరించాడంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో రేవంతి అనే అమ్మాయి చనిపోయింది, ఆమె బిడ్డ శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్ లో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. సినీ పరిశ్రమలో ప్రముఖులందరూ అల్లు అర్జున్ ని ఒక్కరోజు అరెస్ట్ చేస్తేనే, ఆయన ఇంటికి వెళ్లి క్యూలు కట్టి పరామర్శించారు, పాపం శ్రీ తేజ్ అనే బిడ్డని ఒక్కరైనా పట్టించుకున్నారా అంటూ ఆయన చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నా క్యారక్టర్ పై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

    అయితే శ్రీతేజ్ కి ఆర్ధిక పరంగా, అతని భవిష్యత్తు అద్భుతంగా ఉండేలా, మేము ప్రణాళికలు చేస్తున్నామని అల్లు అర్జున్ ఇది వరకే మీడియా తో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా నిన్న ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన జేఏసీ నాయకులు, రేవతి కుటుంబానికి కోటి రూపాయిల ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ, అల్లు అర్జున్ ఇంట్లోకి చొరబడి నిన్న సృష్టించిన విద్వంసం ని మనమంతా చూసాము. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన శ్రీ తేజ్ భవిష్యత్తు కోసం అల్లు అర్జున్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే త్వరలోనే ఆయన శ్రీతేజ్ పేరిట ఒక ట్రస్టు ని ప్రారంభించి, అందులో రెండు కోట్ల రూపాయిలు ఫిక్సడ్ డిపాజిట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

    ఫిక్సడ్ డిపాజిట్ చేయడం వల్ల ఆ డబ్బులు భవిష్యత్తులో బాగా పెరుగుతుంది. శ్రీ తేజ్ కి భవిష్యత్తుకి పూలబాట వేసినట్టు అవుతుంది. అందుకే అల్లు అర్జున్ ఈ నిర్ణయానికి వచ్చాడట. ఈ రెండు కోట్ల రూపాయిలు సమకూర్చడానికి తనతో పాటు, పుష్ప మూవీ టీం, డైరెక్టర్ సుకుమార్ కూడా సహాయం చేస్తారని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి. మరోపక్క అల్లు అర్జున్ పై దాడి ఘటనని సీఎం రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించాడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అసలు సహించబోమని, పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించాడు. ఇలా సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా అల్లు అర్జున్ మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఈ విషయంలో కొంతమంది అల్లు అర్జున్ ని తప్పు పడుతుంటే, మరికొంతమంది సీఎం రేవంత్ రెడ్డి ని తప్పుపడుతున్నారు. ఈ సమస్య ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.