CM Revanth Reddy: నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ కి సంబంధించిన జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటి ని ముట్టడించి రాళ్లతో దాడి చెయ్యడం, అనంతరం ఇంట్లోకి దూసుకెళ్లి సెక్యూరిటీ ని చితకబాదడం, పూల కుండీలను ద్వంసం చేయడం వంటి భయానక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ కి ఇలాంటి పరిస్థితి రావడం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రమైన విమర్శలు చేసారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిన్న ట్విట్టర్ లో ఈ ఘటనపై స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ ‘సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. శాంతి భద్రతల విషయం లో అలసత్వం ప్రదర్శిస్తే అసలు సహించను, దాడికి పాల్పడిన వారి పై కఠినంగా వ్యవహర్తించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమీషనర్ ని ఈ సందర్భంగా ఆదేశిస్తున్నాను. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అంటూ ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ కింద అల్లు అర్జున్ అభిమానులు సీఎం రేవంత్ రెడ్డి ని రాష్ట్రంలో జరుగుతున్నా అనేక దుర్ఘటనల గురించి ప్రస్తావిస్తూ , అల్లు అర్జున్ విషయం లో ఇంత కఠినంగా వ్యవహరించే మీరు, ఇలాంటి విషయాల్లో ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక దురదృష్టకర సంఘటనకి పాన్ ఇండియన్ హీరో కెరీర్ ని నాశనం చెయ్యాలని చూస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే మొన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశం లో సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ, అల్లు అర్జున్ ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడో వివరించగా, దానికి అల్లు అర్జున్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అవ్వడం, తనకి పోలీసులు జరిగిన ఘటన గురించి ఎలాంటి సమాచారం అందించలేదని, వాళ్ళు చెప్పగానే సినిమా మొదలైన కాసేపటికే నేను థియేటర్ నుండి వెళ్లిపోయానని చెప్పుకొచ్చాడు. దీనిపై పోలీసులు మధ్యాహ్నం ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, ఆరోజు జరిగిన ఘటన కి సంబంధించిన సీసీటీవీ వీడియోలు మొత్తం మీడియా ముందు పెట్టి, అల్లు అర్జున్ ఎంత బాధ్యత లేకుండా వ్యవహరించాడో జనాలకు చూపించారు. ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ పై తీవ్రమైన నెగెటివిటీ ఏర్పడేలా చేసింది. ఈ ఘటనపై అల్లు అర్జున్ కి బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.
సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను.
శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు.
సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు…
— Revanth Reddy (@revanth_anumula) December 22, 2024