https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ మాటతో ట్రెండింగ్ లోకి ఆ అమ్మాయి ?, ఇంతకీ ఎవరు ఆమె ? ఎక్కడ నుంచి వచ్చింది ?

Allu Arjun: ‘అల్లు అర్జున్’ రేంజ్ ఇప్పుడు నేషనల్ రేంజ్. ఆ స్థాయిలో ‘పుష్ప’ ఘన విజయం సాధించింది. ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో బన్నీ సూపర్ హిట్ కొట్టాడు. పైగా పుష్ప చిత్రం అభిమానులను, సినీ ప్రముఖులనే కాదు, రాజకీయ నాయకులను కూడా బాగా మెప్పించింది. అందుకే.. బన్నీ కి అభిమానులు విపరీతంగా పెరిగారు. అయితే, శ్రీవిష్ణు హీరోగా వచ్చిన అల్లూరి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌ […]

Written By:
  • Shiva
  • , Updated On : September 20, 2022 / 03:30 PM IST
    Follow us on

    Allu Arjun: ‘అల్లు అర్జున్’ రేంజ్ ఇప్పుడు నేషనల్ రేంజ్. ఆ స్థాయిలో ‘పుష్ప’ ఘన విజయం సాధించింది. ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో బన్నీ సూపర్ హిట్ కొట్టాడు. పైగా పుష్ప చిత్రం అభిమానులను, సినీ ప్రముఖులనే కాదు, రాజకీయ నాయకులను కూడా బాగా మెప్పించింది. అందుకే.. బన్నీ కి అభిమానులు విపరీతంగా పెరిగారు. అయితే, శ్రీవిష్ణు హీరోగా వచ్చిన అల్లూరి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌ కి బన్నీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో ఓ సంఘటన జరిగింది. అల్లూరి సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమ్మాయి పేరు పలకడానికి బన్నీ చాలా ఇబ్బంది పడ్డాడు.

    Allu Arjun

    అల్లూరి సినిమాలో అస్సామీ అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ అమ్మాయి పేరు అసలు బన్నీకి నోరు తిరగలేదు. హీరోయిన్ గురించి మాట్లాడే క్రమంలో అల్లు అర్జున్ నానా తంటాలు పడ్డాడు. చివరకు ఎన్నిసార్లు ట్రై చేసినా ఈ హీరోయిన్ పేరు నేను పలకలేకపోతున్నానంటూ ఫైనల్ గా బన్నీ నే కామెంట్స్ చేశాడు. ఐతే, స్టేజి పైన పేరు పలకడానికి అల్లు అర్జున్ నానా తంటాలు పడుతుంటే.. ఈ అమ్మాయి పైన మీడియా, సోషల్ మీడియా ఫుల్ ఫోకస్ పెట్టింది.

    దాంతో అమ్మడు అనుకోకుండా ప్రస్తుతం ఫుల్ ఫేమస్ అయిపోయింది. బన్నీ దెబ్బకు అసలు ఈ అమ్మాయి ఎవరు ?, ఎక్కడ నుంచి వచ్చింది ? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఒక హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే తమిళ, మలయాళ భామ అయ్యి ఉంటుంది అని కొందరు, కాదు, ఈ అమ్మాయి కచ్చితంగా నార్త్ అమ్మాయి అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

    Allu Arjun

    ఇంతకీ ఈ అమ్మాయి ఎక్కడ నుంచి వచ్చింది ? అంటే.. పుణె నుంచి. నిజానికి ‘హీరోయిన్ అస్సామీ’ పుట్టింది అస్సాంలో, అయినా.. పెరిగింది మాత్రం పుణెలోనే, ఇక మోడలింగ్ చేసింది ముంబై లో. అలా మన తెలుగు ప్రేక్షకులకు దొరికిన ఈ అస్సాం వజ్రం మొదటి సినిమా విడుదల అవ్వకుండానే ఫుల్ ఫేమస్ అయ్యింది. మొత్తానికి బన్నీ దెబ్బకు ఇప్పుడు ఈ బ్యూటీ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది.

    అలాగే హీరోయిన్ అస్సామీ ఒక కన్నడ, మలయాళ సినిమా కూడా ఒప్పుకుంది. తమిళ్ హీరో శింబు పక్కన ఛాన్స్ కొట్టేసింది. మొత్తానికి ఈ బ్యూటీ బాగానే ఛాన్స్ లు పట్టుకుంటుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ప్రస్తుతం వస్తున్న ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, సెకండ్ పార్ట్ తో ‘పుష్ప’ కథకి ముగింపు పలుకుతారని అంతా భావించారు. కానీ, ఇప్పుడు ‘పుష్ప 3’ కూడా రాబోతుంది. మరి ఈ పుష్ప 3 లో అల్లు అర్జున్ నటిస్తాడో ? లేదో చూడాలి.

    Recommended videos:

     

    Tags