Pawan Kalyan- Balineni Srinivas Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వబోతున్నారా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. అధికార పార్టీలో అసంతృప్తులు పెరుగుతుండడం, ప్రజల్లో పార్టీ బలహీనపడుతుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ పార్టీలను ఎంచుకుని, వారితో మంతనాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీపైనే హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కొంత కాలంగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. సొంత పార్టీనే విమర్శిస్తూ కాకరేపుతున్నారు. ఈనేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాన్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
జగన్‌కు సమీప బంధువు..
ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సమీప బంధువు. వైసీపీలో మొదటి నుంచి ఆయన కీ రోల్ పోషించారు. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్ మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణలో బాలినేనిని జగన్ తప్పించారు. అప్పటి నుంచి ఆయన సొంత పార్టీపైనే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కాక రాజేస్తున్నారు. దీంతో ఆయన వైసీపీని వీడుతారా అన్న చర్చ పార్టీలోనే జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాన్ తాజాగా చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి జనసేన పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
Also Read: Pawan Kalyan: కేంద్ర మంత్రి గా పవన్…? లైట్ తీసుకుంటున్న పవర్ స్టార్!
చేనేత చాలెంజ్‌లో బాలినేని వాసు..
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాన్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ చాలెంజ్ చేశారు. చేనేత వస్త్రాలు ధరించి ఆ ఫోటోలు పోస్ట్ చేయాలని సూచించారు. కేటీఆర్ చాలెంజ్‌ను స్వీకరించిన పవన్ కళ్యాన్.. మరో ముగ్గురికి ఆ చాలెంజ్ చేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌తోపాటు బాలినేని వాసుకు చేనేత చాలెంజ్ విసిరారు పవన్. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. బాలినేని వాసు అంటే ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌కు సమీప బంధువు. వైసీపీ నేత, అది కూడా జగన్ సమీప బంధువుకు పవపన్ తన చేనేత చాలెంజ్ విసరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. బీజేపీ ఎంసీ లక్ష్మణ్‌కు విసరడంలో అర్థం ఉంది. దానికీ ఓ లెక్కుంది. కానీ ప్రస్తుతం మంత్రిగా లేని బాలినేని బందువుకు పవన్ చేనేత చాలెంజ్ చేశారన్నది ఇప్పుడు హాట్ టాపికగా మారింది.
బలమైన నేతలకు జనసేన గాలం..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉండడంతో జనసేన దూకుడు పెంచింది. ఇందులో భాగంగా జనసేనాన్ని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మరోవైపు పార్టీ నిర్మాణంపైనా దృష్టిపెట్టారు. ఎన్నికల నాటికి సర్వ సన్నద్ధంగా ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టిపెట్టినట్లు సమాచారం. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి జనసేనలోకి వచ్చేవారిపై దృష్టిపెట్టినట్లు తెలిసింది. వారితో సంప్రదింపులు కూడా మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీలో టికెట్ రాదని భావిస్తున్నవారు కూడా జనసేనవైపు చూస్తున్నారు. టికెట్ కన్ఫర్మేషన్ అయితే పార్టీ మారేందుకు పలువురు సై అంటున్నారట.
Also Read: Munugode By-Election 2022: వచ్చే నెలే మునుగోడు ఉపఎన్నిక.. ముహూర్తం ఫిక్స్