https://oktelugu.com/

ఎంఎంఏ ఫైటర్గా విజయ్‌ దేవరకొండ!

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా మారిపోయాడు విజయ్‌ దేవరకొండ . పెళ్లి చూపులుతో హీరోగా పరిచయం అయిన విజయ్… ‘అర్జున్‌ రెడ్డి’తో ఓవర్ నైట్‌గా మారిపోయాడు. ఈ మూవీతో తెలుగు వారినే కాదు దేశ వ్యాప్తంగా సినీ ప్రియులందరి దృష్టిని ఆకర్షించాడు. అర్జున్‌ రెడ్డి హిందీలో రీమేక్‌ అయిన తర్వాత విజయ్‌ సినిమాలన్నీ హిందీలో డబ్ అయ్యాయి. దాంతో, విజయ్‌కు దేశ వ్యాప్తంగా ఫాలోవర్స్‌ పెరిగిపోయారు. గీతగోవిందం, ట్యాక్సీవాలా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 24, 2020 11:18 am
    Follow us on


    ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా మారిపోయాడు విజయ్‌ దేవరకొండ . పెళ్లి చూపులుతో హీరోగా పరిచయం అయిన విజయ్… ‘అర్జున్‌ రెడ్డి’తో ఓవర్ నైట్‌గా మారిపోయాడు. ఈ మూవీతో తెలుగు వారినే కాదు దేశ వ్యాప్తంగా సినీ ప్రియులందరి దృష్టిని ఆకర్షించాడు. అర్జున్‌ రెడ్డి హిందీలో రీమేక్‌ అయిన తర్వాత విజయ్‌ సినిమాలన్నీ హిందీలో డబ్ అయ్యాయి. దాంతో, విజయ్‌కు దేశ వ్యాప్తంగా ఫాలోవర్స్‌ పెరిగిపోయారు. గీతగోవిందం, ట్యాక్సీవాలా కూడా భారీ విజయాలు సాధించగా… డియర్ కామ్రేడ్‌ ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే, అతని చివరి చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్’ మాత్రం భారీ డిజాస్టర్ గా మారింది.

    Also Read: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ ఎప్పుడంటే…

    దాంతో, మరో బ్లాక్‌ బస్టర్ తో తన టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకోవాలని భావిస్తున్నాడు విజయ్. అందుకు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో చేతులు కలిపాడు. వరుస ఫ్లాపుల అనంతరం ‘ఇస్మార్ట్ శంక‌ర్’ చిత్రంతో మళ్లీ ట్రాక్‌లో పడ్డ పూరి, విజయ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందన్న సంగతి తెలిసిందే. దీనికి ఫైటర్ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈ పాన్‌ ఇండియా మూవీలో విజయ్‌ సరసన బాలీవుడ్‌ యువ నటి అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ముంబైలో శరవేగంగా జరుగుతున్న షూటింగ్‌ కు కరోనా వైరస్‌ బ్రేక్‌ వేసింది. తొందర్లోనే రామోజీ ఫిల్మ్‌ సిటీలోని ప్రత్యేక సెట్‌లో షూటింగ్‌ తిరిగి ప్రారంభించాలని పూరి భావిస్తున్నాడు.

    Also Read: చైతు ‘లవ్ స్టోరీ’కి 40 కోట్లు !

    ఈ చిత్రం గురించి తాజాగా ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఫైటర్ ‌లో విజయ్‌ బాక్సర్ పాత్రను పోషిస్తున్నాడని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ, విజయ్‌ ఇందులో ఎంఎంఏ క్రీడాకారుడిగా కనిపిస్తాడట. ఎంఎంఏ అంటే మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌. మార్షల్‌ ఆర్ట్స్‌లో అన్ని విద్యలతో ఓ కేజ్‌లో భీకరంగా ఫైట్‌ చేయడం. అంతేకాదు ఇందులో విజయ్‌ పాత్ర నత్తిగా మాట్లాడుతుందని సమాచారం. తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి నిర్మితమవుతున్న చిత్రంతో దేవరకొండ బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నాడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మీ కౌర్ తో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్‌ అందిస్తున్నారు. నెల రోజుల్లో చిత్రీకరణ మొదలైతే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదయ్యే అవకాశం ఉంది.