Allu Arjun Upcoming Movies: ప్రస్తుతం పాన్ ఇండియాను శాసించే హీరోల సంఖ్య ఎక్కువై పోయింది. బాహుబలి సినిమాతో ప్రభాస్ మొదటి పాన్ ఇండియా హీరోగా అవతరించినప్పటికి ఆ తర్వాత అల్లు అర్జున్ సైతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా బాట పట్టాడు. ఇక ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు అట్లీ తో చేస్తున్న సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఈ సినిమా వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందా? లేదా ఎన్టీఆర్ కంటే ముందే అల్లు అర్జున్ సినిమా పట్టలెక్కబోతోందా? అనేది తెలియాల్సి ఉంది…
మలయాళం ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బసిల్ జోసఫ్ డైరెక్షన్లో సైతం సినిమా చేయడానికి సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు…
ఇక సంజలీలా భన్సాలీ డైరెక్షన్లో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.పుష్ప 2 సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే సంజయ్ లీలా భన్సాలీ తో కథ చర్చలను జరిపాడు. భన్సాలీ ఇంతకుముందు సినిమాలతో బిజీగా ఉండడం ఆ వెంటనే అల్లు అర్జున్ అట్లీ సినిమాకి కమిట్ అయ్యాడు. ఇక భన్సాలీ మూవీ కూడా అల్లు అర్జున్ లైనప్ లో ఉండడం విశేషం…
రీసెంట్ గా లోకేష్ కనకరాజు సైతం అల్లు అర్జున్ కి కథ వినిపించినట్టుగా తెలుస్తోంది. సూపర్ మ్యాన్ కాన్సెప్ట్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా విషయంలో ఆయన ఎలాంటి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటాడు తనకంటూ ఒక ఐడెంటిటి ఏర్పాటు చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…