https://oktelugu.com/

Allu Arjun : శ్రీ తేజ్ కి నేను ఉన్నాను అంటూ ట్వీట్ చేసిన అల్లు అర్జున్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 16, 2024 / 03:33 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాదిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడంలో కూడా అల్లు అర్జున్ తన మార్క్ చూపించాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవుతుండటం తో అతని అభిమానులు అనందపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆయన బాగా సఫర్ అవుతున్నారనే చెప్పాలి…

    పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న అల్లు అర్జున్ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు…ఇక ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతుంది…ఇక ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మృతి చేసిందిన విషయం మనకు తెలిసిందే. అబ్బాయి తీవ్రమైన అస్వస్థత కి గురైన విషయం మనకు తెలిసిందే… ఇక రెండు రోజుల క్రితం అల్లుఅర్జున్ ని ఈ కేసు మీద అరెస్ట్ చేశారు. ఇక అంతలోకే హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ ఇవ్వడం కూడా మనం చూశాం. మరి మొత్తానికైతే శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పట్టించుకోవట్లేదు అంటు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇక అందులో భాగంగానే ఆయన ఇప్పుడు శ్రీతేజ్ గురించి ఒక ట్వీట్ అయితే చేశారు…ఇక ‘శ్రీ తేజ్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ చెబుతూనే తను ట్రీట్మెంట్ కి అయ్యే డబ్బులు గానీ, తన కుటుంబ వ్యవహారాలకు సంబంధించినవి మొత్తం నేనే చూసుకుంటాను అంటూ చెబుతూనే న్యాయపరమైన ఇబ్బందులు ఉండడం వల్లే నేను అతన్ని కలవలేక పోతున్నాను.

    తొందర్లోనే అతన్ని కలుస్తాను అంటూ అతను చేసిన ట్వీట్ ఇప్పుడు అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ చేసిన ఆ ట్వీట్ తో ఒకసారి అందరు మనసులను గెలుచుకున్నాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం శ్రీ తేజ్ కిమ్స్ హాస్పిటల్ లో వెంటిలేటర్స్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.

    మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. మరి ఏది ఏమైనా కూడా ఆయన తొందరగా క్యూర్ అయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావాలని చాలామంది కోరుకుంటున్నారు… ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 రిలీజ్ రోజున అలా జరగడం రేవతి మృతి చెందిన పట్ల అల్లు అర్జున్ తీవ్రమైన మనస్థాపానికి గురవుతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక శ్రీ తేజ్ పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఆయన చాలావరకు అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా ఆ కుటుంబానికి మాత్రం అల్లు అర్జున్ అండగా ఉంటానని చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు కొంతవరకు అండగా నిలిచిన వాడు అవుతారని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…