Homeఎంటర్టైన్మెంట్Allu Arjun and Trivikram : అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ కంటే ఆ దర్శకుడే...

Allu Arjun and Trivikram : అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ కంటే ఆ దర్శకుడే ఎక్కువా? గురూజీని పక్కన పెట్టడమేంటీ?

Allu Arjun and Trivikram : అల్లు అర్జున్ కి మొదటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంఠపురములో టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. వసూళ్ల వర్షం కురిపించింది. సరిలేరు నీకెవ్వరు మూవీ నుండి గట్టి పోటీ ఎదుర్కొన్న అల వైకుంఠపురములో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్. గతంలో వీరి కాంబోలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి. ఇవి కూడా హిట్. త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ అత్యంత సన్నిహితుడు. ఇద్దరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది.

పుష్ప 2 తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో చేస్తున్నారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ ప్రకటించి ఏళ్ళు గడిచిపోయాయి. పుష్ప 2 అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. దాదాపు 3 ఏళ్ళు అల్లు అర్జున్ ఈ చిత్రానికే కేటాయించాడు. ఈ గ్యాప్ లో మహేష్ బాబుతో త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీ పూర్తి చేసి విడుదల చేశాడు. 2024 సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం పూర్తి స్థాయిలో మెప్పించలేదు. మహేష్ మేనియాతో కొంతలో కొంత బయటపడింది.

Also Read : బన్నీ త్రివిక్రమ్ మూవీ స్టోరీ అదేనా? కన్ఫామ్ అయితే హిట్ పక్కా?

పుష్ప 2 విడుదలై మూడు నెలలు అవుతుంది. దాంతో త్రివిక్రమ్ మూవీ అల్లు అర్జున్ పట్టాలెక్కిస్తాడని అందరూ భావిస్తున్నారు. సడన్ గా అట్లీ పేరు తెరపైకి వచ్చింది. అట్లీతో అల్లు అర్జున్ మూవీ అనే ప్రచారం గతంలో జరిగినప్పటికీ ఎలాంటి ప్రకటన లేదు. తాజా సమాచారం ప్రకారం అట్లీతో మూవీకి అల్లు అర్జున్ సిద్దమయ్యాడట. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇక త్రివిక్రమ్ మూవీ 2025 ద్వితీయార్థంలో ఉండొచ్చు అంటున్నారు.

ఆప్తుడు, మూడు హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ని అల్లు అర్జున్ పక్కన పెట్టి అట్లీకి ఛాన్స్ ఇవ్వడం ఏమిటనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పష్టత రావాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ పాన్ ఇండియా మూవీ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సెట్ చేశాడట.

Also Read : త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా… క్యారెక్టర్ ఏంటంటే..?

Exit mobile version