Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Wishes Ram Charan: రామ్ చరణ్ పుట్టినరోజు కి అల్లు అర్జున్ ఊహించని...

Allu Arjun Wishes Ram Charan: రామ్ చరణ్ పుట్టినరోజు కి అల్లు అర్జున్ ఊహించని సర్ప్రైజ్.. ఇక గొడవలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడినట్టే..

Allu Arjun Wishes Ram Charan: గత కొన్నేళ్ల నుండి రామ్ చరణ్(Global Star Ram Charan), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది, వీళ్లిద్దరి మధ్య ఒకప్పుడు ఉన్న బంధం ఇప్పుడు లేదు అంటూ సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ప్రచారం జరిగిందో మన అందరికీ తెలిసిందే. అనేక సందర్భాల్లో వీళ్ళు కలిసినప్పటికీ ఎక్కడో వీళ్ళ మధ్య గ్యాప్ బాగానే ఉందంటూ ప్రచారం సాగేది. కానీ నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ లో అల్లు అర్జున్ వేసిన ఒక ట్వీట్ తో వీళ్ళ మధ్య ఎలంటిన్ విబేధాలు లేవు, ఒకవేళ ఉన్నా కూడా అవి సర్దుకొని ఉంటాయని అంటున్నారు. ఇంతకు ముందు కూడా అల్లు అర్జున్ రామ్ చరణ్ పుట్టిన రోజు కి శుభాకాంక్షలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. కానీ అందులో ఫీల్ ఉండేది కాదు, ఎదో ఫార్మాలిటీ కోసం చెప్పినట్టుగా అనిపించేది.

కానీ ఇప్పుడు అలా లేదు, రామ్ చరణ్ కెరీర్ ప్రారంభం లో అల్లు అర్జున్ అతన్ని ఏ రేంజ్ లో లేపేవాడో , ఇప్పుడు కూడా అదే రేంజ్ లో లేపినట్టుగా అనిపించింది. ఇంతకీ ఆయన వేసిన ట్వీట్ ఏమిటంటే ‘నా స్వీటెస్ట్ కజిన్ రామ్ చరణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా పెద్ద.. కాదు కాదు.. పెద్ది సక్సెస్ ఫుల్ ఇయర్ రావాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఆయన రామ్ చరణ్ గురించి మనస్ఫూర్తిగా ట్వీట్లు వేసి చాలా కాలమే అయ్యింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ని రామ్ చరణ్ స్తాపించినప్పటి నుండి వీళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త. కానీ అలాంటివేమీ లేవు, మేమిద్దరం ఎప్పటికీ అన్నదమ్ములమే అని మరోసారి చెప్పకనే చెప్పాడు అల్లు అర్జున్. ఇక రాబోయే రోజుల్లో కూడా వీళ్లిద్దరు పాత మెగా డేస్ గుర్తు చేస్తారని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇక పెద్ది విషయానికి వస్తే నేడు విడుదల చేసిన ‘కుస్తీ’ టీజర్ కి ఫ్యాన్స్ నుండి , మూవీ లవర్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ ని ఈ టీజర్ lo చూస్తుంటే ఆంజనేయ స్వామి నే కనిపించాడని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ‘ఓజీ’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ విజయాలతో మంచి ఊపు మీదున్న మెగా ఫ్యాన్స్ ని రీసెంట్ గా విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పుడు ‘పెద్ది’ తో రామ్ చరణ్ భారీ కం బ్యాక్ ఇచ్చి మెగా ఫ్యామిలీ అభిమానులను మరోసారి గర్వం తో మీసం మెలేసేలా చేస్తాడని బలమైన నమ్మకం తో చెప్తున్నారు మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version