Eluru Instagram love affair tragedy: చాంతడాంత ఉపోద్ఘాతం లేదు. మసాలాకూడా దట్టించడం లేదు. ఇటువంటి కంటెంట్ కు రకరకాల భాష్యాలు చెప్పిరాయొచ్చు. చూపించి చూపించకుండా.. విప్పి విప్పి విప్పకుండా..జ్యోతిలక్ష్మి డ్యాన్స్ లాగా.. సిల్క్ స్మిత అందాల ఆరబోత లాగా ఎన్నో చేయొచ్చు. బట్, ఇక్కడ ఆ అవసరం లేదు. సోదీ లేకుండా.. సూటిగా చెప్పాలంటే.. ఇదో డర్టీపిక్చర్..అనైతికమైన బంధం వల్ల ఇద్దరిజీవితాలు కడతేరిపోయాయి.
అది ఏలూరు జిల్లా యర్రమళ్ల. ఈ గ్రామానికి చెందిన గుండుగొలను సత్యనారాయణ,వీరమ్మ దంపతులు ఉన్నారు. వీరికి ఐదుగురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు చిన మావుళ్లయ్య(25) చేపలప్యాకింగ్ చేస్తాడు. ఇతడు ఇన్ స్టా గ్రామ్ తరుచూ చూస్తాడు. అందులో శ్రీకాకుళం జిల్లా సింగుపురం ప్రాంతానికి చెందిన ఇర్రి రమ్య(34) పరిచయమైంది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ స్నేహానికి దారి తీసింది. అది కాస్త ప్రేమగా మారింది. రమ్యకు అప్పటికే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రమ్య వ్యవహారం ఆమె భర్త, కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు యర్రమళ్ల వచ్చారు. మావుళ్లయ్య కు వార్నింగ్ ఇచ్చారు. అప్పటికే రమ్య అతడితో ఉండటం మొదలుపెట్టింది. దీంతో వారు ఆమెను తీసుకుని వెళ్లిపోయారు.
రమ్య సింగుపురం వెళ్లిన తర్వాత కొద్ది రోజులు అక్కడే ఉంది. అనంతరం మావుళ్లయ్య వద్దకు వచ్చింది. ఈక్రమంలో వారిద్దరూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మావుళ్లయ్య మార్చి 24న తన అన్న కుమారుడు సతీష్ తో రమ్య వచ్చిన విషయాన్ని ఫోన్ లో చెప్పాడు. ‘ఈరోజు రాత్రి వరకు మీరు ఉంగుటూరు లో ఉండండి. నేను ఉదయం వస్తాను. వచ్చాక మాట్లాడదామని సతీష్ చెప్పాడు. ఆలోగా నాచుగుంట గ్రామానికి రమ్మని’ మావుళ్లయ్య కు సతీష్ చెప్పాడు. మరుసటి రోజు ఉదయం సతీష్ ఉంగుటూరు వచ్చాడు. అక్కడ మావళ్లయ్య, రమ్య కనిపించలేదు.
అనుమానం వచ్చిన సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాలువ గట్టు పరిసర ప్రాంతాలలో వెతుకుతుండగా మావుళ్లయ్య దుస్తులు కనపించాయి. దీంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి ఈ విషయాన్ని చెప్పడంతోవారు కాలువలోకి దూకి వెతికారు. ఆ రోజు రాత్రి మావుళ్లయ్య శవం దొరికింది. రమ్య శవం చేబ్రోలు ప్రాంతంలో లభించింది.
రమ్యకు పెళ్లయి పిల్లలున్నారు. ఆమె ఓ యువకుడితో స్నేహం పెంచుకోవడం చాలా తప్పు. మావుళ్లయ్య కూడా పెళ్లయి పిల్లలున్న మహిళతో స్నేహంకొనసాగించడం మరింత తప్పు. వారిద్దరుచేసిన తప్పు ఓ తల్లికి గర్భశోకాన్ని.. ఇద్దరుపిల్లలకు తల్లి ప్రేమను దూరం చేసింది. అనైతికం ఎప్పటికైనా అనైతికమే.