ఎన్నడు లేని విధంగా 2020 సంక్రాంతి తెలుగు సినీ పరిశ్రమలో ఆనంద సంబరాలు తీసుకొచ్చింది . ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను సినీ పరిశ్రమ చవి చూసింది. అందులో మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ కి ఈ సంక్రాంతి చాలా ప్రత్యేకంగా, గుర్తుండి పోయేలా ఆనందానుభూతి మిగిల్చింది.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో తెలుగునాట బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాసింది. ఏకంగా 162 కోట్లకు ఫైగా వసూళ్లను రాబడుతోంది. ఇంకా రాబడుతూనే ఉంది. అమెరికాలో అయితే 3 .65 మిలియన్ వసూళ్లతో నాన్ బాహుబలి రికార్డుగా మిగిలింది. రికార్డు పరంగా యు ఎస్ ఏ లో తెలుగు చిత్రాల వసూళ్ల పరంపరలో మూడో స్థానం లో నిలిచింది. అంతటి ఆనందం మిగిల్చిన చిత్రం తరవాతి మూవీ కూడా ప్రత్యేకం గా నిలవాలని బన్నీ ప్లాన్ వేస్తున్నాడు.
బన్నీ సినీ కెరీర్ కి ఆర్య చిత్రం కి ఉన్న లింక్ ప్రేక్షకులు అంత త్వరగా మరువలేరు. అల్లు అర్జున్ నటించిన ఈ రెండో చిత్రం తెలుగు సినిమాకి ఒక కొత్త దారి చూపడమే కాదు, బన్నీ కి కూడా ఒక గట్టి పునాది అయ్యింది. ఇదే చిత్రం తో సుకుమార్ అనే ఒక ఇంటలిజెంట్ డైరెక్టర్ తెలుగు సినిమా కి పరిచయ మయ్యాడు. ఈ దర్శకుడు ఆర్య తరవాత 100 % లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం లాంటి మరుపురాని చిత్రాలను తెలుగు ప్రేక్షకులకి అందించి తన సత్తా ఏమిటో చూపించాడు. ఇపుడు తాజాగా అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక విభిన్న చిత్రాన్ని ప్రేక్షకులకి అందించా బోతున్నాడు. శేషాచలం అడవుల్లో జరుగుతున్న గంధం చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతిని మిగిల్చేలా సుకుమార్ మల్చబోతున్నాడు. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా , ఆఫీసర్ గా రెండు భిన్న కోణాల్లో ఈ చిత్రంలో కనిపించి ప్రేక్షకుల్ని మైమరిపిస్తాడు అని అంటున్నారు. 2020 దసరా కానుకగా రాబోతున్న ఈ చిత్రం మరో అద్భుత విజయాన్ని అల్లు అర్జున్ కి అందిస్తుందని బన్నీ సన్నిహితులు అంటున్నారు. కాగా ఈ చిత్రానికి శేషాచలం అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Nothing succeeds like success