Ration Card: దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు రేషన్ కార్డులను కలిగి ఉన్నారు. రేషన్ కార్డులు ఉన్నవాళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న స్కీమ్స్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే రేషన్ కార్డులు ఉన్నా కొంతమందికి రేషన్ సరుకులు పొందే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రేషన్ డీలర్లు సరుకులు ఇవ్వకపోయినా, సరుకులు తక్కువగా ఇచ్చినా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గతేడాది మార్చి నెల నుంచి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ ఏడాది మార్చి నెల వరకు ఈ స్కీమ్ అమలవుతుండగా కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ వల్ల కేంద్రంపై 2,60,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తీసుకునే ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. రేషన్ సరుకుల విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా ఏపీ ప్రజలు 18004252977 నంబర్ కు, తెలంగాణ ప్రజలు 180042500333 నంబర్ కు కాల్ చేయడం ద్వారా సులభంగా ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ నంబర్లకు కాల్ చేయడం ద్వారా డీలర్లు చేసే మోసాల గురించి కూడా సులభంగా ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికీ 5 కేజీల బియ్యం అందిస్తుండటం గమనార్హం. రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.