Allu Arjun Mumbai Shift: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ని ఇక మీదట హైదరాబాద్ లో చూడడం కష్టమేనా..?, మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆయనకు సినిమా స్టోరీ వినిపించాలంటే ముంబై కి వెళ్లాల్సిందేనా?, ప్రతీ పుట్టినరోజుకి అభిమానులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి వెళ్తుంటారు , ఇక మీదట అలాంటివి జరిగే అవకాశాలే లేవా అంటే అవుననే అంటున్నారు. కారణం అల్లు అర్జున్ తన బేస్ మొత్తాన్ని ముంబై కి షిఫ్ట్ చేయబోతున్నాడు అట. ఎప్పుడైనా షూటింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆయన హైదరాబాద్ కి వస్తాడట. అకస్మాత్తుగా ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం, ఇక మీదట ఆయన బాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేయబోతున్నాడు అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇప్పుడు బాలీవుడ్ దర్శకుల హవా నడవట్లేదు కదా, సౌత్ దర్శకుల హవా నే నడుస్తుంది కదా, మరి అల్లు అర్జున్ ముంబై కి వెళ్లి ఏమి ఉపయోగం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ముంబై కి ఆయన ఎందుకు షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నాడో సరైన కారణం ఎవరికీ తెలియదు కానీ, ఆయనకు ఆ ప్రాంతం అంటే మొదటి నుండి బాగా ఇష్టం అనేది తెలుస్తోంది. ఎప్పటికైనా ముంబై లో స్థిరపడాలి అనే లక్ష్యం అల్లు అర్జున్ కి గతం లో ఉండేదట. ఇప్పుడు గత కొంతకాలంగా ఆయన ముంబై లోనే ‘రాకా’ మూవీ షూటింగ్ చేస్తున్నాడు. అందుకే అక్కడ ఉండడం కోసం ఆయన ఒక ఇల్లు ని కూడా కొనుగోలు చేసాడట. ఆ వాతావరణం ఆయనకు ఎంతో బాగా నచ్చడం తో , అక్కడికి శాశ్వతంగా షిఫ్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ‘రాకా’ తర్వాత అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ కూడా అత్యధిక శాతం ముంబై పరిసరాల్లోనే జరుగుతుందట. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన ‘సంజయ్ లీలా భన్సాలీ’ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ముంబై లోనే జరగబోతుంది. ఇలా రాబోయే మూడు ఏళ్ళు ఆయన ముంబై లోనే షూటింగ్ చేసే పరిస్థితులు రావడం తో , అక్కడే సొంత ఇల్లు తీసుకొని ఉండాలని ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ తో పాటు స్నేహా రెడ్డి, అల్లు అయాన్ , అల్లు అర్హ కూడా ముంబై షిఫ్ట్ అవ్వబోతున్నారు. ఇక అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, అల్లు శిరీష్ వంటి వారు హైదరాబాద్ లోనే ఉంటారని తెలుస్తోంది.