https://oktelugu.com/

Pushpa Movie: కన్నడ మీడియాకు క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్… కారణం ఏంటంటే

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 17న రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించాయి. రిలీజ్ కి రెండు రోజులే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్ల వేగాన్నిపెంచేశారు. ఈ మేరకు బన్నీ, రష్మిక ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ లకు అటెండ్ అవుతూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 06:18 PM IST
    Follow us on

    Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 17న రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించాయి. రిలీజ్ కి రెండు రోజులే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్ల వేగాన్నిపెంచేశారు. ఈ మేరకు బన్నీ, రష్మిక ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ లకు అటెండ్ అవుతూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. ఇక నేడు ఈ జంట కన్నడ మీడియా ముందు హాజరయ్యారు. బెంగుళూరులో జరిగిన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మీడియాకు క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కి లేటుగా రావడంపై కన్నడ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది.

    Pushpa Movie

    Also Read: ‘పుష్ప’ను వెంటాడుతున్న సెన్సార్ కష్టాలు.. అక్కడ ఈరోజే?

    ఉదయం 11.15 నిమిషాలకు ప్రెస్ మీట్ అని చెప్పి… మీరు మధ్యాహ్నం 1.15 నిమిషాలకు ఎలా వస్తారని, ఇక్కడ మీడియాను మీరు అవమానించినట్లే అని ఒక రిపోర్టర్ కొద్దిగా ఘాటుగానే ప్రశ్నించాడు. దీనికి బదులుగా బన్నీ సమాధానం చెప్తూ… ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఉందని నాకు ఇందాకే తెలిసింది. తెలిసిన వెంటనే ప్రైవేట్ జెట్ లో బయల్దేరాను. మధ్యలో పొగమంచు కప్పేయడంతో ల్యాండింగ్ ఇష్యూ వలన కొద్దిగా లేట్ అయ్యింది. మిమ్మల్ని ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. ఇది ఎవరిని హార్ట్ చేయాలనీ చేయలేదు సారీ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా సారీ చెప్తే మనిషి పెరుగుతాడు కానీ తగ్గడు అని తనదైన స్టైల్లో బన్నీ చెప్పడం అందర్నీ ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక బన్నీ సారీ చెప్పడంపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అనసూయ, సునీల్​ మేకోవర్​ ప్రేక్షకులను మెస్మరైజ్​ చేస్తుందని.. ఫహద్​ ఫాజిల్ అద్భుతంగా నటించారని ఇండస్ట్రీలో ప్రచారం నడుస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే రెండు రోజులు ఆగక తప్పదు.

    Also Read: రేపే రిలీజ్.. పీకల్లోతు కష్టాల్లో పుష్ప !