టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో అడవి నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో రానున్న ‘పుష్ప’కి సంబంధించి రేపటి నుండి సాంగ్ తీయబోతున్నారని తెలుస్తోంది. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన సుక్కు, బన్నీ రష్మిక పై రొమాంటిక్ సాంగ్ తీయబోతున్నాడట. అన్నట్టు ఈ సాంగ్ షూట్ లో అతి తక్కువమంది మాత్రమే పాల్గొంటారట. ఇక రీసెంట్ గా బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి వచ్చిన పుష్పరాజ్ ఇంట్రడ్యూజింగ్ టీజర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది.
ఇక టీజర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఊరమాస్ లా సాగుతూ కన్నార్పకుండా చేసింది. కాగా ఈ సినిమా కూడా అలాగే ఉండేలా సుక్కు ప్లాన్ చేస్తున్నాడట. మొత్తానికి పుష్ప గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బన్నీ బీభత్సం సృష్టించబోతున్నాడు. ఎలాగూ మేకింగ్‌లో సుక్కు టాలెంట్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.
అలాగే గతంలో ఈ ఇద్దరి నుండి వచ్చిన ఆర్య, ఆర్య2 సినిమాలు క్లాసీ టచ్ తో సాగుతూ సినిమా క్వాలిటీ పరంగా బన్నీ స్థాయిని పెంచాయి. అయితే ఈ సారి సుక్కు తన శైలిని మార్చి కొత్తగా ట్రై చేస్తున్నాడు.
పక్కా రా ఫిల్మ్‌ను ఫన్‌తో మిక్స్ చేసి, డెప్త్ వున్న కథను మరింత బలంగా చెప్పి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మొత్తానికి సుక్కు కసరత్తులు చేస్తున్నాడు. ఎలాగూ రంగస్థలంతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. దీంతో గతంలో ఉన్న క్లాస్ ఇమేజ్‌ను రంగస్థలం చిత్రంతో పటాపంచలు చేసేశాడు సుకుమార్. ఇప్పుడు బన్నీతో మరో క్లాసిక్ చిత్రంతో మరో మాసివ్ హిట్ ఇవ్వబోతున్నాడు. పైగా పచ్చని అడవిలో బన్నీ కూడా కొత్త రఫ్ గెటప్‌లో అదిరిపోయే లుక్ లో కనిపించబోతున్నాడు.
మొత్తానికి బన్నీ మేకోవర్, సుకుమార్ అండ్ టీమ్ క్వాలిటీ వర్క్, ఫొటోగ్రఫీ, దేవీ శ్రీ బ్యాగ్రౌండ్ స్కోర్, భారీ చిత్రీకరణ, మైత్రి సంస్థ పెట్టిన పెట్టుబడి అన్నీ కలిసి ఈ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేశాయి.