పుష్ప సినిమా ఆగస్టు 15న విడుదల కష్టమే !

టాలీవుడ్లో ఇప్పటికే అనేక సినిమా విడుదల తేదీలు ఇబ్బడిముబ్బడిగా ప్రకటించేయటంతో ఇండస్ట్రీ వర్గాలలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. సరైన లెక్కలన్నీ వేసుకుని డేట్స్ ప్రకటిస్తున్నారా ? లేదా తర్వాత డేట్స్ విషయంలో క్లాష్ వస్తుందేమో అనుకుని ముందుగా త్వరపడుతున్నారా ? నిజంగా ఈ సినిమాలన్నీ ప్రకటించిన రోజున విడులవటం కుదిరే పనేనా ? అసలు కొన్ని సినిమాలు ఆ రోజుకి థియేటర్స్ లోకి రావటం సాధ్యం కాదని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ […]

Written By: Neelambaram, Updated On : February 1, 2021 10:41 am
Follow us on


టాలీవుడ్లో ఇప్పటికే అనేక సినిమా విడుదల తేదీలు ఇబ్బడిముబ్బడిగా ప్రకటించేయటంతో ఇండస్ట్రీ వర్గాలలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. సరైన లెక్కలన్నీ వేసుకుని డేట్స్ ప్రకటిస్తున్నారా ? లేదా తర్వాత డేట్స్ విషయంలో క్లాష్ వస్తుందేమో అనుకుని ముందుగా త్వరపడుతున్నారా ? నిజంగా ఈ సినిమాలన్నీ ప్రకటించిన రోజున విడులవటం కుదిరే పనేనా ? అసలు కొన్ని సినిమాలు ఆ రోజుకి థియేటర్స్ లోకి రావటం సాధ్యం కాదని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ‘పుష్ప’ మూవీ విడుదల విషయంలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 13న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అయితే సినిమాను కుదిరితే సంవత్సారాల పాటు చెక్కుతూ కూర్చోటానికి మొగ్గు చూపే టాలీవుడ్ దర్శకుల్లో సుకుమార్ ఒకరు. అలాంటి దర్శకుడు చాలా ముందుగానే నిర్ణయించిన తేదీకి మూవీని పూర్తి చేయటం అంటే దాదాపు అసంభవమని చెప్పుకోవాలి. అసలు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సుకుమార్ కి తెలియకుండానే జరిగిందన్న టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

పుష్ప తరువాత స్టైలిష్ స్టార్ తన నెక్స్ట్ మూవీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఆచార్య మూవీ మే 13న రిలీజ్ చేసేసి తదుపరి ప్రాజెక్ట్ మీదకి షిఫ్ట్ అవుతాడు కొరటాల, ఆ సమయానికి రెడీగా ఉండాలని కూడా అల్లు అర్జున్ పుష్ప సినిమాని స్పీడ్ గా చేసేయాలనే ఆలోచనలో భాగంగానే ఇలా చేస్తున్నారట. ఇంకా ఈ సినిమా షూటింగ్ దాదాపు 150 రోజులు ఉందని, ఎంత తొందరపడినా అనుకున్న తేదికి విడుదల చేయటం కుదరదట. పుష్ప సినిమా విడుదల విషయంలో ఉన్న పుకార్ల కారణంగా లైగర్, రాధేశ్యామ్, పవన్-రానా మూవీ మేకర్స్ కన్ఫ్యూషన్ లో ఉన్నారు. ఈ పరిస్థితుల నుండి అందర్నీ బయట పడేయగలిగేది ఒక్క సుకుమార్ మాత్రమే… చూద్దాం ఏం జరుగుతుందో !