Allu Arjun Revanth Reddy Bonding Reason: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. స్టార్ హీరోలందరు సినిమాలతో పాటు బిజినెస్ రంగంలో కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా మాల్స్, థియేటర్లను నిర్మించుకోవడంలో ఎవరికి వాళ్లు ముందు వరుసలో దూసుకెళ్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఇప్పటికే ‘త్రిబుల్ ఏ’ పేరుతో అమీర్ పేట్ లో ఒక మాల్ కట్టాడు. అది సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కోకాపేట లో ఇండియాలోనే లార్జెస్ట్ డాల్బీ సినిమాస్ ను కట్టాడు. ఇక ఈ ‘అల్లు సినిమాస్’ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రాండ్ గా ఓపెన్ చేయించారు. నిజానికి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ కి గతంలో కొన్ని విభేదాలైతే తలెత్తాయి. ముఖ్యంగా ‘పుష్ప 2’ సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ‘రేవతి’ అనే మహిళ మృతి చెందింది.
Also Read: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘అల్లు సినిమాస్’..తెలుగు వాళ్లంటే అంత చులకనా?
దాంతో అల్లు అర్జున్ మీద తీవ్రమైన యాక్షన్ తీసుకోమని రేవంత్ రెడ్డి ఫైర్ అవ్వడం తో ఆయన్ని ఒక్కరోజు పాటు జైల్లో పెట్టారు. ఇక రేవతి కొడుకు అపస్మారక స్థితిలో ఉండడంతో అతని ట్రీట్ మెంట్ కి అయ్యే ఖర్చులు మొత్తాన్ని అల్లు అర్జున్ భరిస్తున్నాడు…
సినిమాల పరంగా ముందుకు వెళ్లాలన్న బిజినెస్ రంగంలో కూడా రాణించాలన్న పొలిటికల్ గా పవర్ ఉండాలి అనే ఉద్దేశ్యంతోనే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డికి మధ్య పెరిగిన గ్యాప్ ని ఫుల్ ఫిల్ చేయాలని అల్లు అరవింద్ వీళ్లిద్దరిని కలపడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. అల్లు అరవింద్ కి దిల్ రాజు చాలా మంచి ఫ్రెండ్స్ కావడంతో ప్రస్తుతం దిల్ రాజు రేవంత్ రెడ్డికి చాలా దగ్గర ఉంటున్నాడు. కాబట్టి అతన్ని రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ కి మధ్య బాండింగ్ కుదిరిలా ఏర్పాటు చేశాడు.
ఇక వాళ్ళిద్దరి మధ్య ఇంకా బాండింగ్ స్ట్రాంగ్ కావడానికి అల్లు సినిమాస్ ఓపెన్ చేయడానికి రేవంత్ రెడ్డిని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది…ఇక ఇదంతా చూస్తున్న మెగా అభిమానులు మాత్రం అల్లు అర్జున్ ఎదుగుదలకు కారణమైన మెగాస్టార్ చిరంజీవిని పిలిచి అతని చేతుల మీదుగా ఈ అల్లు సినిమాస్ ని ఓపెన్ చేయిస్తే బాగుండేది కదా అంటూ కొన్ని అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు…
