Allu Arjun Remuneration 2026: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న హీరోలలో అల్లు అర్జున్ ఒకరు… పుష్ప, పుష్ప 2 సినిమాలతో ఫ్యాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించిన ఆయన ప్రస్తుతం అట్లీ తో చేస్తున్న ‘రాకా’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి రాబోతున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేస్తున్న మరో సినిమాతో ప్రేక్షకులందరిని ఒక కొత్త ప్రపంచం లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళ తర్వాత ఆయన సందీప్ రెడ్డివంగాతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. గతంలో వీళ్ళిద్దరి మధ్య కొన్ని కథ చర్చలు కూడా నడిచాయి. అల్లు అర్జున్ సైతం సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సందీప్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సైతం అల్లు అర్జున్ మరో సినిమా చేస్తాడట.
ఇక రాజమౌళి – అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటివరకు ఒక సినిమా కూడా రాలేదు. కాబట్టి వీళ్ళ కాంబినేషన్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయని సినిమా ఇండస్ట్రీలోని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఇక ఈ మూడు సినిమాలకు కలిపి ఆయన దాదాపు 1500 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఎందుకంటే ఇప్పుడు ఆయన క్రేజ్ తారా స్థాయిలో ఉంది. రాకా సినిమాతో కనక భారీ విజయాన్ని సాధిస్తే ఆయన ఎక్కడ లేని ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా తన మార్కెట్ కూడా విస్తృతంగా పెంచుకున్నవాడు అవుతాడు. కాబట్టి అతనికి సినిమాకి 400 నుంచి 500 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ని కూడా ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక రాకా సినిమాతో పాటు లోకేష్ కనకరాజు సినిమా రెండు కూడా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయగలిగితే మాత్రం అల్లు అర్జున్ టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతాడు. తనను ఢీకొట్టే వారు కూడా ఎవరూ లేనంత పొజిషన్ ని టచ్ చేస్తాడు. ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…