Gaddar Awards 2025 Allu Arjun: పోగొట్టుకున్న చోటనే దక్కించుకోవాలి. అదే సత్తా ఉన్న మనిషి లెక్క అని పెద్దలు అంటూ ఉంటారు. నేడు అల్లు అర్జున్ అదే చేసాడు. తన ప్రమేయం లేకుండా జరిగిన ఒక దురదృష్ట సంఘటనకు బాద్యుడిని చేస్తూ అరెస్ట్ చేసి జైలు లో వేయించారు. దేశం మొత్తం అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్న రోజుల్లో, తన కుటుంబం మొత్తం కన్నీళ్లు పెట్టుకునేలా చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీ లో జరిగిన తొక్కిసిలాట ఘటన కు కేవలం ఒక్కడినే బాద్యుడిని చేసి, క్యారెక్టర్ ని సైతం సమాధి చేసేలా ముఖ్యమంత్రి ఆరోజు ప్రసంగం ఇస్తుంటే అల్లు అర్జున్, ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమానులకు ప్రాణాలు పోయినంత పని అయ్యింది. సీఎం మాట్లాడిన మాటల్లో నిజం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఎక్కడో ఆ విషయం లో సమాచార లోపం ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది, కానీ చివరికి అవమానాలు పడింది అల్లు అర్జున్ మాత్రమే.
తనని అంతలా అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా నేడు రాత్రి ఆయన ‘గద్దర్ అవార్డ్స్’ ఉత్తమ నటుడు క్యాటగిరీ అవార్డుని తీసుకోవడం నిజంగా కాలర్ ఎగరేసే మూమెంట్ అనొచ్చు. ప్రతిభ ని శత్రువు అయినా గుర్తించాల్సిందే అని పెద్దలు చెప్పే మాట నూటికి నూరు పాళ్ళు నిజమని అల్లు అర్జున్ నేడు నిరూపించి చూపించాడు. ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ మీద సీఎం రేవంత్ రెడ్డి కి నిజంగా కోపం ఉంది అనుకుందాం. కోపం ఉన్నంత మాత్రానా ప్రపంచం మొత్తం మన తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన ‘పుష్ప 2’ ని విస్మరించగలడా?, ఒకవేళ అలా చేస్తే జనాల్లో వ్యతిరేకత పెరుగుతుంది కదా?, అందుకే ఈ అవార్డు ని ఇచ్చినట్టు కొంతమంది చెప్పుకొస్తున్నారు. మరికొంత మంది అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా రూల్ ప్రకారం వెళ్లే మనిషి, తప్పు చేస్తే శిక్షించే గుణం ఉన్న వ్యక్తి, అదే సమయం లో శత్రువులో కూడా ప్రతిభ ని గుర్తించే వ్యక్తి అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇది ఇప్పుడు ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటూ సోషల్ మీడియా లో తిరుగుతున్నాడు. ఇది కదా అసలు సిసలు ‘తగ్గేదేలే’ మూమెంట్ అని సంబరాలు చేసుకుంటున్నారు. అంతే కాదు అల్లు అర్జున్ ప్రసంగం ఇస్తూ చివర్లో ‘అవార్డ్స్ ఫంక్షన్ కాబట్టి సరదాగా సినిమాలో నుండి ఒక డైలాగ్ ని’ చెప్పొచ్చు కదా అని రేవంత్ రెడ్డి అనుమతిని తీసుకొని మరీ పుష్ప 2 లోని డైలాగ్ చెప్పాడు. ‘ఆ బిడ్డ ఒంటి మీద చిన్న గీత ఒంట గంగమ్మ తల్లి జాతర లో వేట తలలను నరికినట్టు రప్పా రప్పా నరుకుతాను ఒక్కొక్కడినీ’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ డైలాగ్ కి సీఎం రేవంత్ రెడ్డి ముఖం చిన్నబోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
