Allu Arjun Gaddar Award 2025: తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఏర్పాటు చేసిన ‘గద్దర్ అవార్డ్స్'(Gaddar Awards) ఎంతో అద్భుతంగా నిన్న సాయంత్రం ఎంతో అద్భుతంగా జరిగింది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులందరూ ఈ ఈవెంట్ కి హాజరు అయ్యారు. సినీ పరిశ్రమలో దాదాపుగా అందరికీ ఆహ్వానం అందింది కానీ, కేవలం కొంతమంది మాత్రమే ఈ ఈవెంట్ కి వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన అవార్డుల జాబితాలోని విజేతలు మాత్రమే ఈ ఈవెంట్ కి హాజరు అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ని ఆహ్వానించారు కానీ, ఆయన విదేశాల్లో షూటింగ్ లో ఉండడం వల్ల రాలేకపోయారు. ఇకపోతే ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో అందరికంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) బాగా హైలైట్ అయ్యాడు. ఆయన ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం.
అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ ఎంతో ప్రతిష్టాత్మకమైన తెలంగాణ గద్దర్ అవార్డుని నాకు అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, దిల్ రాజు(Dil Raju) గారికి మరియు వేదికని అలంకరించిన అందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదంతా నా అభిమాన దర్శకుడు సుకుమార్ వల్ల మాత్రమే సాద్య పడింది. ఈ అవార్డు కేవలం ఆయన విజన్, లవ్ వల్లే నాకు వచ్చింది. అదే విధంగా నా నిర్మాతలకు, నాతో కలిసి నటించిన ఆర్టిస్టులకు, ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీర్చి దిద్దిన టెక్నీషియన్స్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఇక్కడ నేను రాజమౌళి గారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఆరోజు మీరు పుష్ప 1 హిందీ లో విడుదల చేయమని చెప్పి ఉండకపోయుంటే ఇంత దూరం వచ్చే వాళ్ళం కాదేమో. ఇది నాకు ఎంతో స్పెషల్ అవార్డు. ఎందుకంటే పుష్ప 2 కి నేను గెలుచుకున్న మొట్టమొదటి అవార్డు ఇది. దీనిని నేను నా అభిమానులకు అంకితం చేస్తున్నాను’.
చివర్లో లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరు అన్నట్టు అల్లు అర్జున్ కొట్టిన ‘పుష్ప 2’ డైలాగ్ సభ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయేలా చేసింది. ఆయన సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) ని అనుమతి కోరుతూ ‘ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా ‘పుష్ప 2′ లోని డైలాగ్ కొట్టొచ్చా?(నవ్వుతూ)’ అని అడుగుతాడు. దానికి రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వడంతో ‘ఆ బిడ్డ ఒంటి మీద చిన్న గీత పడ్డ, జాతర వేట తలలను రప్పా రప్పా నరికినట్టు నరుకుతాను ఒక్కొక్కడిని’ అని అంటాడు. ఈ డైలాగ్ రేవంత్ రెడ్డి ని ఉద్దేశించే అన్నట్టు సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు ఎలివేషన్స్ వేసుకుంటున్నారు. అల్లు అర్జున్ అభిమానులు కానీ వారు కూడా అవమానించినోడి చేతుల మీద సత్కారం పొందావు శబాష్ అంటూ ప్రశంసిస్తున్నారు.
