Allu Arjun: పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న విడుదల చేశారు. కాగా ఈ మూవీ ప్రీమియర్ షోలు ఒక రోజు ముందే పడ్డాయి డిసెంబర్ 4న రాత్రి 10 గంటల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 ప్రదర్శనలు మొదలయ్యాయి. ఇక మూవీ లవర్స్, స్టార్ హీరోల అభిమానులకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమా ఎంజాయ్ చేయడం ఒక అలవాటు. సంధ్య థియేటర్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ షోల ప్రదర్శన నేపథ్యంలో వేల సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకున్నారు. అల్లు అర్జున్ వచ్చారు, అభిమానులతో సినిమా చూశారు.
కాగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. క్రౌడ్ ని అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారట. ఒక్కసారిగా అభిమానులు పరిగెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 38 ఏళ్ల రేవతి అనే మహిళా అభిమాని కన్నుముశారు. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు కూడా అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
ఈ నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం కీలక నిర్ణయం తీసుకుందట. ఇకపై స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వకూడదని భావిస్తున్నారట. రేవతి మరణంపై పుష్ప 2 నిర్మాతలు స్పందించారు. ఆ ఘటన బాధించిందన్న మైత్రీ మూవీ మేకర్స్.. ఆ కుటుంబానికి అండగా ఉంటాము. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. మంచి వైద్యం అందిస్తామని అన్నారు.
కాగా అల్లు అర్జున్ స్వయంగా రేవతి మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఒక వీడియో బైట్ విడుదల చేశారు. రేవతి మరణవార్త ఎంతగానో కలచివేసింది. పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనకపోవడాని కారణం ఇదే. రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. నా తరపున బాధిత కుటుంబానికి రూ. 25 లక్షలు ప్రకటిస్తున్నాను. మా టీమ్ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుంది… అని తెలియజేశారు.
అల్లు అర్జున్ స్పందించిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా అల్లు అర్జున్ కారణంగా అజిత్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. 2023 సంక్రాంతికి తునివు విడుదలైంది. అర్ధరాత్రి షోకి హాజరైన ఓ అభిమాని బస్ టాప్ పై నుండి కింద పడి మరణించాడు. అజిత్ ఆ అభిమాని కుటుంబాన్ని ఏ విధంగా కూడా ఆదుకోలేదు.
