Chandrababu: చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ముందు చూపు లేక చతికిలపడుతోంది. వ్యూహాల అమలులో నవ్వుల పాలు అవుతోంది. అనవసర విషయాలపై ఫోకస్ పెట్టి అపఖ్యాతి తెచ్చుకుంటోంది. ప్రజాగ్రనుగ్రహం పొందాలనే తపనతో ప్రజాగ్రహాన్ని కూడగట్టుకుంటోంది. రెండు పార్టీల మధ్య వైరాన్ని రాష్ర్ట సమస్యగా భావించి ప్రజల్లోకి వెళ్లి అభాసుపాలవుతోంది. రాజనీతి పరుడిగా పేరు పొందిన చంద్రబాబు తెలివితక్కువ విధానాలతో పార్టీకి నష్టాలే తీసుకొస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల వైసీపీతో జరిగిన గొడవలో టీడీపీ ప్రతిష్ట పెంచుకోవాలని చూసినా దాని ఫలితం పొందలేకపోతోంది. ఇది రెండు పార్టీల మధ్య జరిగిన గొడవగానే ప్రజలు చూస్తున్నారు. కానీ టీడీపీ ఇదేదో జరిగినట్లు మసాలా రుద్దేందుకు ప్రయత్నించి అపహాస్యం అవుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను రెండు పార్టీల మధ్య జరుగుతున్న గొడవలుగానే చూస్తున్నారు తప్ప రాజకీయాలకు సంబంధం లేనివిగానే గుర్తిస్తున్నారు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు గా మారింది టీడీపీ పరిస్థితి. రెండు కులాల మధ్య జరిగిన ఘర్షణగానే భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి పెద్దగా సానుభూతి రాలేదు. దీంతో టీడీపీ ఆత్మరక్షణల పడినట్లు సమాచారం.
టీడీపీ నేత పట్టాబి విషయంలో చంద్రబాబు అంచనాలు తప్పినట్లు తెలుస్తోంది. జగన్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుంచి మద్దతు లేకపోవడంతో టీడీపీ ఒంటరైపోయింది. పైగా వైసీపీ నేతలు జనాగ్రహ దీక్షల పేరుతో కౌంటర్ ఇవ్వడంతో టీడీపీ అంతర్మథనంలో పడింది. 36 గంటల దీక్షకు దిగినా టీడీపీకి లాభం లేకుండా పోయింది.
అనవసర విషయాలపై పట్టించకుని పార్టీని గాడిలో పెట్టకుండా తప్పుదారిలో నడుస్తున్నట్లు టీడీపీ సీనియర్లు వాపోతున్నారు. పార్టీని సరైన విధంగా దిశా నిర్దేశం చేయడంలో బాబు పట్టు తప్పుతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే పలు కోణాల్లో తప్పులు చేస్తూ అధికారానికి దూరం అవుతున్నట్లు సమాచారం. దీంతో పార్టీ భవిష్యత్తులో కూడా అధికారం చేజిక్కించుకునే ప్రయత్నాల్లో విఫలం అవుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.