Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా నిన్న దీని ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది. ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. అలానే కన్నడ హీరో ధనుంజయ, సునీల్, అనసూయ, అజయ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ మొదట ఐదు భాషల్లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు. కానీ పలు కారణాల చేత హిందీ మినహా మిగతా భాషల్లో ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

దీనితో హిందీ వెర్షన్ ట్రైలర్ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఓ కన్ఫర్మేషన్ అప్డేట్ ని ఇచ్చేసారు. హిందీ యూట్యూబ్ ఛానల్ గోల్డ్ మైన్స్ టెలి ఫిల్మ్స్ వారు ట్రైలర్ లాంచ్ ఈరోజే ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరి హిందీ వెర్షన్ ట్రైలర్ కి, తెలుగు వెర్షన్ ట్రైలర్ కి ఏమన్నా మార్పులు చేసారా, లేదా ఒకేలా ఉంటుందా అనేది తెలియాలంటే కొన్ని గంటలు ఆగక తప్పదు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది.
#PushpaTrailer out Today at 2:30 PM 🤘
Stay Hyped & Pumped in😎#PushpaTheRise #JhukungaNahi 🤙#PushpaTheRiseOnDec17 @alluarjun @iamRashmika @Mee_Sunil @aryasukku @ThisIsDSP @GTelefilms @Dhananjayaka @anusuyakhasba pic.twitter.com/tbRJhOrIjH— Goldmines Telefilms (@GTelefilms) December 7, 2021