Pushpa Movie: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసిన అల్లు అర్జున్ “పుష్ప: సినిమా…

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం “పుష్ప”. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎర్రచందనం నేపద్యంతో రూపొందుతున్న ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు, మొదటి భాగం పుష్ప ది రైజ్ … డిసెంబర్ 17 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 10, 2021 2:55 pm
Follow us on

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం “పుష్ప”. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎర్రచందనం నేపద్యంతో రూపొందుతున్న ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు, మొదటి భాగం పుష్ప ది రైజ్ … డిసెంబర్ 17 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి సెన్సార్ బోర్డ్ నుండి యూ / ఏ  సర్టిఫికేట్ పొందింది ఈ సినిమా. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

Pushpa Movie

Also Read: లక్ష్య రివ్యూ

ఇటీవల విడుదలైన ట్రైలర్ లో బన్నీ స్పెషల్ అప్పియరెన్స్, డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్, పెర్ఫార్మెన్స్ అన్నీ హైలైట్ అయ్యాయి. ఇక “పుష్ప ది రైజ్”లో విలన్ పాత్రలో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కనిపించబోతున్నారు. “ఊ అంటావా ఉహూ అంటావా” అంటూ సాగే ఓ స్పెషల్ సాంగ్ లో సమంత రూత్ ప్రభు కనిపించనుంది. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ స్పెషల్ నంబర్‌ ప్రోమో ఈరోజు విడుదల కానుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ , సాంగ్స్ హైప్ ని క్రియేట్ చేశాయి . ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచారు చిత్రబృందం. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. డిసెంబర్ 12 న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

https://twitter.com/PushpaMovie/status/1469154238206918656?s=20

Also Read: దిగ్గజ నటులతో పోలిస్తే.. కమలహాసన్ కు ఆ విషయంలో నిరాశే..!