SP Balasubrahmanyam: ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం..’ మహా సినీ ఘన గాన గంధర్వుడు. ఆయన పాటకు భాషలతో సంబంధం లేదు, ప్రాంతాలతో పని లేదు. అన్నీ బాషల వారని అన్నీ ప్రాంతాలను ఆయన పాట ఒక మధురమైన మేఘంలా కమ్మేసింది. ఆయన గాత్రంలోని వైవిధ్యం కోట్లాది ప్రజలను సమ్మోహితులను చేసింది. అయితే, ఆయన చనిపోయాక, ఆ గొంతును మిస్ అయ్యాం. అందుకే, నేటికీ బాలును తల్చుకోకుండా ఉండలేం.

తాజాగా దిగ్గజ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కూడా బాలుగారి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. బాలుగారితో ఆయనకున్న అనుబంధం గురించి యండమూరి మాటల్లోనే.. “భార్యా గుణవతి శత్రు” నవలలో హీరో హీరోయిన్లు అతి బీద స్థితి నుంచి టాప్ సింగర్స్ అవుతారు. కథ మొత్తం విని “నీకు ఇలాంటి వికృతమైన, తెలివైన ఆలోచనలు ఎలా వస్తాయి” అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. సంగీత ప్రాధాన్యమైన నవల.
ఆ నవల కోసం బాలు ఇంట్లో కూర్చుని… ఇంకా చెప్పాలంటే బెడ్‌రూంలో నెల మీద కూర్చుని, రెండు సాయంత్రాలు మృదు’మధురం’గా చర్చించాం. నవల తనకే ‘అంకితం’ ఇచ్చాను. నా ‘అగ్నిప్రవేశం’లో కూడా బాలుది ముఖ్య పాత్ర. సాధారణ గృహిణి స్థాయి నుంచి యమున హోంమినిస్టర్‌గా మారటానికి దోహదం చేసే పాత్ర. సినిమాలో తన మీద ఒక పాట కూడా ఉంది.
అయితే, ఆ తర్వాత చాలా సంవత్సరాలు మేము కలుసుకో లేదు. ఓ రోజు ‘ఈ నాడు’లో తను వ్రాసిన ఆఖరి వ్యాసంలో నా పేరు ప్రస్తావించాడని ఎవరో మెసేజ్ పెట్టారు. సంతోషంతో ఫోన్ చేద్దామనుకున్నాను కానీ, అప్పటికే తను హాస్పిటల్ లో ఉన్నాడని తెలిసింది. ఇంత సీరియస్ అనుకోలేదు. కానీ తన ఇక మనకు లేకుండా వెళ్ళిపోయాడు.
Also Read: Samantha: సమంతను వరించిన మరో అవార్డు… రాజీ పాత్రకు “ఫిల్మ్ ఫేర్”
బాలు గారి మరణం పట్ల మీ రెస్పాన్స్ లేదేం ? అని ఎవరో మెసెంజర్ లో నన్ను అడిగారు. ఏం రెస్పాన్స్ ఇవ్వాలి? హైదరాబాదులో శ్రీనగర్ కాలనీలో బాలుతో ఒక్కడినే పాడించుకుని వినటం… బాలుకి సంబంధించినంత వరకూ నాకు అదొక అగరొత్తు పరిమళం ఉన్న జ్ఞాపకం.
Also Read: Lakshya Twitter Review: నాగశౌర్య ‘లక్ష్యం’ నెరవేరిందా?