Allu Arjun: తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోల్లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత స్థానంలో అల్లు అర్జున్ ఉన్నాడు ఎందుకంటే ప్రభాస్ ‘బాహుబలి 2’ సినిమాతో 1800 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొడితే, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాడు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇండియాలో ద మోస్ట్ పాపులర్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే అల్లు అర్జున్ కెరియర్ లో ఇద్దరు దర్శకులతో ఇప్పటివరకు సినిమాలైతే చేయలేదు. ఆ దర్శకులు ఎవరు అంటే ఒకరు రాజమౌళి కాగా, మరొకరు కొరటాల శివ కావడం విశేషం…కొరటాల శివ ఇండస్ట్రీలో ఉన్న ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబులతో సినిమాలను చేశాడు. వాళ్లకి భారీ విజయాలను కూడా కట్టబెట్టాడు… అల్లు అర్జున్ తో మాత్రం ఆయన సినిమా చేయలేదు. కారణం ఏంటి అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయింది…
ఇక అలాగే అల్లు అర్జున్ రాజమౌళి తో కూడా ఒక సినిమా కూడా చేయలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమా చేశాడు. కానీ అల్లు అర్జున్ తో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేదు. ఇక ఫ్యూచర్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అల్లు అర్జున్ రాజమౌళితో సినిమా చేయడానికి చాలా వరకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.
అలాగే రాజమౌళి సైతం అల్లు అర్జున్ లాంటి హీరో దొరికితే వైవిద్య భరితమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తానని గతంలో పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఎందుకంటే రాజమౌళికి హార్డ్ వర్క్ చేసే హీరోలు అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ ఒక క్యారెక్టర్ కోసం విపరీతంగా కష్టపడతాడు. డ్యాన్స్ మూమెంట్స్ వేయడంలో కూడా ఆయన చాలావరకు హార్డ్ వర్క్ చేసి మరి ఎలాంటి కష్టతరమైన స్టెప్స్ అయిన సరే చాలా ఈజ్ తో వేస్తూ ప్రేక్షకులు మైమరిపింప జేస్తుంటాడు.
కాబట్టి తన ఎంటైర్ కెరియర్ లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా కోరుకుంటున్నాడు. ఇక వాళ్ళ కోరిక మేరకు వీళ్ళ కాంబినేషన్లో తొందరలోనే సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…