https://oktelugu.com/

Allu Arjun: 4 ఏళ్ళ తర్వాత లుక్ మార్చిన అల్లు అర్జున్..త్రివిక్రమ్ సినిమాకి ఈ రేంజ్ లుక్ ని ఫ్యాన్స్ ఊహించి ఉండరు!

అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం పడిన కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన లుక్ ని కూడా మూడేళ్ళ నుండి మార్చకుండా, అలాగే మైంటైన్ చేస్తూ వచ్చాడంటే, పని పట్ల ఆయనకీ ఉన్న డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే అల్లు అర్జున్ ఎట్టకేలకు ఇప్పుడు పుష్ప లుక్ నుండి పూర్తిగా బయటకి వచ్చినట్టు తెలుస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : January 1, 2025 / 11:30 PM IST
    Follow us on

    Allu Arjun: అల్లు అర్జున్ గత నాలుగేళ్లుగా తన విలువైన సమయాన్ని మొత్తం పుష్ప సిరీస్ కోసమే కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. ఈ సిరీస్ ఏకంగా బాహుబలి 2 కోటలను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర ని సృష్టించింది. ఒక మామూలు కమర్షియల్ సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం, బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేయడం సాధారణమైన విషయం కాదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ బుక్ లో పుష్ప సిరీస్ గురించి సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. అలాంటి అద్భుతాలను నెలకొల్పింది ఈ చిత్రం. సినిమా విడుదలై నెల రోజు అవుతుంది. ఇప్పటికీ ఈ సినిమాకి వసూళ్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే సంక్రాంతికి కూడా రన్ వచ్చేలా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ రావడం కష్టమే.

    ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ ఈ సినిమా కోసం పడిన కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన లుక్ ని కూడా మూడేళ్ళ నుండి మార్చకుండా, అలాగే మైంటైన్ చేస్తూ వచ్చాడంటే, పని పట్ల ఆయనకీ ఉన్న డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే అల్లు అర్జున్ ఎట్టకేలకు ఇప్పుడు పుష్ప లుక్ నుండి పూర్తిగా బయటకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెల నుండి ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు కానుంది. అందులో భాగంగా ఈ సినిమాలోని ఆయన లుక్ కి సంబంధించిన లుక్ టెస్ట్ ని చేయబోతున్నారట. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ని అభిమానులు ఎప్పుడూ చూడని లుక్ లో కనిపించబోతున్నాడని టాక్. అందుకోసం ఆయన పొడవాటి జుట్టు కూడా పెంచుతున్నట్టు తెలుస్తుంది. ఇది పీరియడ్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన చిత్రం కాబట్టి అల్లు అర్జున్ ప్రత్యేకంగా కొన్ని మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోడానికి సిద్ధం అవుతున్నాడట.

    సుమారుగా 500 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ ని ఈ చిత్రం కోసం ఖర్చు చేయనున్నారు. ఇది వరకే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో జులాయి, సన్ ఆఫ్ సత్య మూర్తి, అలా వైకుంఠపురంలో వంటి చిత్రాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సునామీ ని సృష్టించాయి మన అందరం చూసాము. అలాంటి కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడం, అందులోనూ పుష్ప 2 తర్వాత రాబోతుండడంతో ఈ సినిమా చిత్రం అంచనాలు కచ్చితంగా కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ ఎంచుకొని సరికొత్త పాయింట్ ని డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ సరికొత్త పాయింట్ ఏమిటి అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.