Game Changer Trailer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్ చరణ్ అభిమానుల ఆరేళ్ళ ఎదురు చూపులకు తెర దించుతూ , పాన్ ఇండియన్ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి కేవలం రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాదు, సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా రాజమౌళి రాబోతున్నాడు. ఈ ట్రైలర్ తో సినిమా రేంజ్ ఏమిటో అందరికీ అర్థం అవుతుందని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు మొన్న విజయవాడ లో జరిగిన కటౌట్ లాంచ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. ఈ ట్రైలర్ మీదనే ఓవర్సీస్ మొదటి రోజు ఓపెనింగ్స్ ఆధారపడింది.
అయితే అన్ని భాషలకు సంబంధించిన ట్రైలర్స్ రేపే విడుదలయ్యే అవకాశాలు లేవు. కేవలం తెలుగు వెర్షన్ ట్రైలర్ మాత్రమే రాబోతుంది. తమిళ వెర్షన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ప్రముఖ తమిళ స్టార్ హీరో విజయ్ ని దిల్ రాజు ఆహ్వానించాడని, అందుకు విజయ్ కూడా వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి సంబంధించిన డేట్ ఖరారు కావాల్సి ఉంది. విజయ్ ఇచ్చే డేట్ ని బట్టి తమిళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంటుంది. అదే విధంగా హిందీ లో కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసాడు దిల్ రాజు. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ కి షారుఖ్ ఖాన్ మొదటి నుండి మంచి స్నేహితుడు. ఆయన పిలిచిన వెంటనే షారుఖ్ ఖాన్ ఈ ఈవెంట్ కి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
అదే విధంగా కన్నడ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కేజీఎఫ్ హీరో, రాకింగ్ స్టార్ యాష్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడట. ఇలా అన్ని భాషల్లోనూ సూపర్ స్టార్స్ చేత ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసాడు దిల్ రాజు. ఇన్ని రోజులు ప్రొమోషన్స్ సరిగా చేయడం లేదంటూ నిర్మాత దిల్ రాజు పై రామ్ చరణ్ అభిమానులు ఏ రేంజ్ లో విరుచుకు పడ్డారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ప్లానింగ్ ని చూసి వాళ్లకి ఆనందంతో నోటి నుండి మాట రావడం లేదు. ఇది ఇలా ఉండగా నాల్గవ తేదీన రాజమండ్రి లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. బాబాయ్, అబ్బాయి ని ఒక వేదిక పై చూసి మెగా అభిమానులకు చాలా రోజులైంది. ఈ ఈవెంట్ వాళ్ళ జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.