https://oktelugu.com/

Siva Rajkumar: క్యాన్సర్ నుండి కోలుకున్న కన్నడ నటుడు శివ రాజ్ కుమార్..సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్..వైరల్ అవుతున్న వీడియో!

కన్నడ ప్రేక్షకులు విపరీతంగా ఆరాధించే హీరోలలో ఒకరు శివ రాజ్ కుమార్. స్వర్గీయ శ్రీ రాజ్ కుమార్ గారి కుమారుడు. రాజ్ కుమార్ ని కన్నడ ఆడియన్స్ ఒక దేవుడిలా కొలుస్తారు. మన తెలుగు లో సీనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలైతే పోషించారో, అలాంటి పాత్రలను కన్నడ సినీ పరిశ్రమ లో రాజ్ కుమార్ పోషించారు. అతని కుమారిడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శివ రాజ్ కుమార్ కూడా అశేష ప్రేక్షకాభిమానం ని పొంది సూపర్ స్టార్ గా ఎదిగాడు.

Written By:
  • Vicky
  • , Updated On : January 1, 2025 / 11:41 PM IST
    Follow us on

    Siva Rajkumar: కన్నడ ప్రేక్షకులు విపరీతంగా ఆరాధించే హీరోలలో ఒకరు శివ రాజ్ కుమార్. స్వర్గీయ శ్రీ రాజ్ కుమార్ గారి కుమారుడు. రాజ్ కుమార్ ని కన్నడ ఆడియన్స్ ఒక దేవుడిలా కొలుస్తారు. మన తెలుగు లో సీనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలైతే పోషించారో, అలాంటి పాత్రలను కన్నడ సినీ పరిశ్రమ లో రాజ్ కుమార్ పోషించారు. అతని కుమారిడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శివ రాజ్ కుమార్ కూడా అశేష ప్రేక్షకాభిమానం ని పొంది సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇక రెండవ కుమారుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కన్నడ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పునీత్, ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ కి పర్యాయపదం లాగా ఉండేవాడు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం కన్నడ సినీ పరిశ్రమకి తీరని లోటు. అక్కడి ఆడియన్స్ పునీత్ ని తలుచుకొని రోజంటూ లేదు.

    అయితే ఆయన సోదరుడు శివ రాజ్ కుమార్ కి కూడా క్యాన్సర్ ఉందని, ఆయనకి ప్రాణాపాయం పొంచి ఉందంటూ మీడియా లో ప్రచారమైన ఒక వార్త అభిమానులను కలవర పెట్టింది. మా దేవుడికి ఏమి జరగకుండా చూడమని కన్నడ ప్రేక్షకులు ప్రార్థనలు చేసారు. అయితే అభిమానులు ఆందోళన చెందుతున్న విషయాన్ని అర్థం చేసుకున్న శివ రాజ్ కుమార్ న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళ కోసం ఒక వీడియో ని విడుదల చేసాడు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ ‘క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత ఎవరికైనా భయం ఉండడం సహజమే. కానీ ఈ భయం నుండి నన్ను దూరం చేసేందుకు కోట్లాది మంది కన్నడ ప్రేక్షకుల ఆశీస్సులు, నా భార్య గీత నన్ను కోలుకునేందుకు సహాయ పడ్డాయి. వాళ్లందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఒకపక్క కీమో థెరఫీ చేయించుకుంటూనే మరో పక్క నేను సినిమా షూటింగ్స్ చేయాల్సి వచ్చింది’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ ‘కీమో థెరఫీ చేస్తున్న సమయంలో నాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ మీ ఆశీస్సులతో 45 మూవీ ని పూర్తి చేశాను. ఈ క్లిష్టమైన ప్రయాణం లో వైద్యులు నాకు అందించిన సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ ఏడాది శివరాజ్ కుమార్ నటించిన రంగల్ చిత్రం విడుదలై కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆయన తెలుగు లో రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. తదుపరి షెడ్యూలు లో ఆయన పాల్గొనాల్సి ఉండగా, ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా కి వెళ్లాల్సి వచ్చింది. ఎట్టకేలకు ట్రీట్మెంట్ ని విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చినందుకు ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.