Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Mumbai Airport News: విమానాశ్రయంలోకి వెళ్లకుండా అల్లు అర్జున్ ని అడ్డుకున్న సిబ్బంది..వీడియో...

Allu Arjun Mumbai Airport News: విమానాశ్రయంలోకి వెళ్లకుండా అల్లు అర్జున్ ని అడ్డుకున్న సిబ్బంది..వీడియో వైరల్!

Allu Arjun Mumbai Airport News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కి నిన్న ఒక వింత పరిణామం ఎదురైంది. విమానాశ్రయం లోకి ఆయన అడుగు పెడుతున్నప్పుడు అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్నాడు. ఐడీ తో పాటు తన ముఖాన్ని చూపించాలని సిబ్బంది అడగ్గా, అందుకు అల్లు అర్జున్ ఇష్టపడలేదు. దీంతో కాసేపు అల్లు అర్జున్ మరియు భద్రతా సిబ్బంది మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ఒక మెట్టు క్రిందకు దిగి తన ముఖానికి తగిలించిన మాస్కుని తీసి చూపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. సినీ సెలబ్రిటీలు అన్న తర్వాత సాధ్యమైనంత వరకు గందరగోళం వాతావరణాన్ని కలిగించకుండా ఉండడానికి ఇలాంటి పబ్లిక్ ఉండే చోట్ల ముఖానికి మాస్క్ వేసుకొనే తిరుగుతారు. అలా అల్లు అర్జున్ కూడా చేశాడు. కానీ ఎంత పెద్ద స్టార్ అయినా రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందే.

Also Read:అఖండ 2′ సెప్టెంబర్ 25న రావట్లేదు..కానీ ఎందుకు ఈ హంగామా?

ఐడీ తో ముఖాన్ని చూపించడం అనేది భద్రతా కి సంబంధించిన కచ్చితమైన నియమం. పాటించాల్సిందే. అంతే కానీ సిబ్బంది తో వాగ్వాదానికి దిగడం కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ముంబై విమానాశ్రయం అట, సాధారణంగా సెలబ్రిటీలు ఇక్కడ మాస్కులు లేకుండానే తిరుగుతూ ఉంటారు కదా, అల్లు అర్జున్ ఎందుకు వేసుకున్నాడు?, ఈగో అడ్డొచ్చే ఆయన ముఖానికి తగిలించుకున్న మాస్క్ ని తియ్యడానికి ఇష్టపడలేదా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్. సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమా తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన చర్చలు చేయడం కోసే ముంబై కి వచ్చినట్టు తెలుస్తుంది.

Pavan Kumar Sarihaddu
Pavan Kumar Sarihadduhttps://oktelugu.com/
Helping teams stay organized and productive every day
Exit mobile version