Anantapur MLA Controversy: ఏపీలో( Andhra Pradesh) ప్రభుత్వం పై ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దలు బాగానే కష్టపడుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం అనేక రకాల విమర్శలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం ఇచ్చారని.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుందామని.. ప్రజలతో మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు రోజురోజుకు విమర్శలకు కారణం అవుతోంది. చాలా రకాల ఆరోపణలు వారిపై వస్తున్నాయి. తాజాగా రాయలసీమ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నేరుగా రంగంలోకి దిగి.. మైనారిటీలకు చెందిన ఆసుపత్రిని స్వాధీనం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నేరుగా బాధితులు మంత్రి లోకేష్ కు విన్నవించుకున్నారు. స్పందించి న్యాయం చేయకుంటే తమకు ఆత్మహత్య శరణ్యమని వారు వేడుకున్నారు.
Also Read: చంద్రబాబు ఉన్నతి వెనుక రాజశేఖర్ రెడ్డి.. నిజం ఎంత?
సీనియర్ నేతను పక్కనపెట్టి.. అనంతపురం( Ananthapuram) నగరంలో వైకుంఠం ప్రభాకర చౌదరి అనే సీనియర్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా కూడా కొనసాగుతూ వచ్చారు. 2014లో ఎమ్మెల్యే అయ్యారు. 2019లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరిని పక్కనపెట్టి.. ఫార్మా రంగంలో రాణించిన వెంకటేశ్వర ప్రసాద్ కు టికెట్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన పేరుతో ఇప్పుడు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనుచరులు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత రాత్రి అనంతపురంలో మైనారిటీలకు చెందిన ఓ ఆసుపత్రి పై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అక్కడ పనిచేస్తున్న వైద్యులు, ఆసుపత్రి నిర్వహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ప్రభాకర చౌదరికి మంచి పేరు ఉంది. కానీ ఆయనను పక్కనపెట్టి వెంకటేశ్వర ప్రసాద్ కు టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి అనేక రకాల వివాదాలు ఆయనపై వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన అనుచరులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అన్న విమర్శ ఉంది.
Also Read: ఆ ఐదుగురిని నమ్ముకున్న జగన్!
ఐదు కోట్ల విలువచేసే ఆసుపత్రి పై కన్ను..
ప్రస్తుతం అనంతపురం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అనంతపురంలో చికెన్ వ్యాపారస్తులు మొదలుకొని.. ఎవరు ఏం చేయాలన్నా ఎమ్మెల్యే మనుషులకు కప్పం కట్టాల్సిన దుస్థితి ఉందని టాక్ వినిపిస్తోంది. నేరుగా వ్యాపారులకే ఎమ్మెల్యే బంధువులు, అనుచరులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే ప్రసాద్ పుట్టినరోజుకు ఫ్లెక్సీలు కట్టేందుకు రేషన్ డీలర్ల వద్ద డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సాయి నగర్ లో ఐదు కోట్ల విలువైన ముస్లిం మైనారిటీలకు చెందిన ఆసుపత్రిని ఆక్రమించేందుకు ఎమ్మెల్యే అనుచరులు ప్రయత్నించారని.. తమపై దాడికి దిగారని బాధితులు వాపోతున్నారు. పోలీసులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని.. ఇలాగైతే తమకు ఆత్మహత్య శరణ్యమని.. కాపాడాలని మంత్రి నారా లోకేష్ ను నేరుగా బాధితులు కోరడం విశేషం.
వామ్మో అనంతపురం ఎమ్మెల్యే!
ఇప్పటికే చికెన్ వ్యాపారస్తులు మొదలుకుని, ఎవరేం చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిన దుస్థితి
తాజాగా రూ.5 కోట్ల విలువైన ముస్లిం మైనార్టీలకు చెందిన క్లినిక్‌ను ఆక్రమించేందుకు ఎమ్మెల్యే అనుచరులు అందరూ చూస్తుండగానే రాత్రి దౌర్జన్యానికి… pic.twitter.com/AyhySlxoQV
— greatandhra (@greatandhranews) August 10, 2025