Akhanda 2 New Release Date: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) సెకండ్ ఇన్నింగ్స్ ని జీవితాంతం ఆయన అభిమానులు పదిలంగా తమ జ్ఞాపకాల్లో పెట్టుకునేలా చేసిన చిత్రం ‘అఖండ’. ఈ చిత్రం తర్వాత బాలయ్య కెరీర్ లో జరిగిన మార్పులను, ఆయన సాధిస్తున్న విజయాలను మన కళ్లారా చూసాము. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా ‘అఖండ 2 – తాండవం'(Akhanda 2 – Thandavam) అనే చిత్రం చేస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి. బాలకృష్ణ కూడా రీసెంట్ గానే ఈ చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేసాడు. ఈ సినిమాని సెప్టెంబర్ 25న ఎట్టిపరిస్థితిలో విడుదల చేస్తామని మేకర్స్ పదే పదే చెప్తున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమా సెప్టెంబర్ 25 న రావడం లేదని, ఈ ఏడాది డిసెంబర్ 5 న విడుదల చేస్తున్నామని, నిర్మాతలు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఇది వరకే చెప్పేశారట.
Also Read: అమెజాన్ ప్రైమ్’ మరియు ‘నెట్ ఫ్లిక్స్’ మధ్య నలిగిపోతున్న ‘అఖండ 2’
అంతే కాదు సెప్టెంబర్ 25 న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ‘ఓజీ'(They Call Him OG) విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఆ చిత్రం మేకర్స్ కూడా ‘అఖండ 2’ టీం ని కలిసి చర్చలు జరిపారట. వాళ్ళు సెప్టెంబర్ 25 న రావడం లేదని స్పష్టంగా క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఓజీ మేకర్స్ మొదటి లిరికల్ వీడియో ని విడుదల చేసారని, ఆగష్టు 14 న టీజర్ ని కూడా రెడీ చేస్తున్నారని అంటున్నారు. కానీ అకస్మాత్తుగా బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేసాడు, సెప్టెంబర్ 25 న వచేస్తున్నాం అంటూ మేకర్స్ మరోసారి ట్విట్టర్ లో ట్వీట్ వెయ్యడం తో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇదేంటి సినిమా వాయిదా అన్నారు, మళ్ళీ సెప్టెంబర్ 25 న వస్తున్నాం అంటున్నారు, అసలు ఏమి జరుగుతుంది అంటూ కామెంట్స్ చేశారు. సినిమా వాయిదా పడిన విషయం వాస్తవమే.
Also Read: అఖండ 2′ టీం కి చురకలు అంటించిన ‘ఓజీ’ నిర్మాత..ఇలా అయితే కష్టమే!
కానీ వాయిదా పడినా కూడా సెప్టెంబర్ 25 నే వస్తున్నాం అనడానికి ఒక కారణం ఉందట. బయ్యర్స్ నుండి ఫ్యాన్సీ ఆఫర్స్ తో అడ్వాన్స్ లు వస్తున్నాయి. ఇలాంటి సమయం లో వాయిదా అంటే కచ్చితంగా అడ్వాన్స్ లు ఆగిపోయ్యే అవకాశాలు ఉంటాయి. అంతే కాకుండా ఓటీటీ డీల్ కూడా ఇంకా ముగియలేదు. వాళ్ళతో బేరం ఆడేందుకే మేకర్స్ ఇంకా వాయిదా పడిన విషయాన్నీ గోప్యంగా ఉంచారని,వచ్చే నెలలో వాళ్ళే వాయిదా పడిన విషయాన్నీ అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. ఒకవేళ క్లాష్ ఉంటే మాత్రం రెండు సినిమాలకు డ్యామేజ్ తప్పదు. ఓజీ కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దానికి రికార్డ్స్ పెట్టాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు, కానీ క్లాష్ వస్తే తక్కువ థియేటర్స్ వస్తాయి, అభిమానుల టార్గెట్ రీచ్ అవ్వడం కష్టం, పైగా ఈ సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్లు బిజినెస్ జరిగింది.