తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం తమవైపు తిప్పుకోవాలనే ఉద్దేశ్యంతో మన స్టార్ హీరోలందరు చాలా గొప్ప సినిమాలు చేయడానికి తీవ్రమైన ఆసక్తిని చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న అల్లు అర్జున్ సైతం కెరియర్ స్టార్టింగ్ లో సినిమాలు చేయడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేశాడు. ఇక అందులో భాగంగానే ఒక్కడు సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన గుణశేఖర్ దర్శకత్వంలో ఎలాగైనా సరే ఒక సినిమా చేయాలని తీవ్రమైన ప్రయత్నం అయితే చేశాడు. మరి ఇలాంటి సందర్భంలోనే గుణశేఖర్ చాలా బిజీగా ఉన్నా కూడా అల్లు అర్జున్ వాళ్ల నాన్న అయిన అల్లు అరవింద్ తో రికమెండ్ చేయించి మరి వరుడు సినిమా చేశాడు.
అయినప్పటికి ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో అల్లు అర్జున్ తీవ్రంగా నిరాశ చెందాడు. వరుడు సినిమా డిజాస్టర్ గా మారింది. నిజానికి ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ని అనుకున్న విధంగా తెరకెక్కించి ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది.
కానీ అలా కాకుండా ఈ సినిమా స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉండేలాగా ప్లాన్ చేశారు. అలాగే ఈ సినిమాలోని సీన్స్ ను డిఫరెంట్ గా రాసుకున్నారు. కానీ ఎట్టకేలకు అది ఒక్కడు సినిమాలాగే మారిపోయింది. మరి ఐదు రోజుల పెళ్లి అనే కాన్సెప్ట్ చాలా గొప్పగా తీసి సినిమాని క్లాసిక్ ఫిలిం గా నిలిపే ప్రయత్నం చేయలేకపోయినందుకు ఈ సినిమా మీద చాలా విమర్శలైతే వచ్చాయి.
మరి ఒక రకంగా గుణ శేఖర్ లాంటి దర్శకుడికి సైతం ఈ సినిమా బ్యాడ్ నేమ్ ని తీసుకొచ్చిందనే చెప్పాలి… ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ‘రుద్రమదేవి’ సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందులో అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్రకి చాలా మంచి గుర్తింపు లభించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…