Pawan Kalyan OG Latest Updates: తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ఓజీ(They Call Him OG) చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ లో మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానుల్లో కూడా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో ఈ సినిమాని చూద్దామా అనేంత ఆత్రుత నెలకొంది. కారణం పవన్ కళ్యాణ్ నేటి తరం యూత్ ట్రెండ్ కి తగ్గ కాన్సెప్ట్ తో సినిమా చేయడం, దానికి తోడు ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేయడమే. ఇక రీసెంట్ గా విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’ లిరికల్ వీడియో సాంగ్ కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. విడుదలై 20 రోజులు దాటినా కూడా ఇప్పటికీ ఈ పాట అన్ని మ్యూజిక్ యాప్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతూ ఉంది.
ఇక వినాయక చవితి రోజున ఈ సినిమా నుండి రెండవ పాట ‘సువ్వి సువ్వి’ (మెలోడీ సాంగ్) విడుదల కాబోతుంది. నిన్న ఆ పాటకు సంబంధించిన పోస్టర్ ని విడుదల చేయగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సెప్టెంబర్ 25 న ఈ చిత్రాన్ని అన్ని విధాలుగా సిద్ధం చేసేందుకు కార్యక్రమాలు చివరి దశలో వచ్చాయి. అయితే ఇలాంటి సమయం లో ఈ చిత్రం పై ఒక మాఫియా గ్యాంగ్ విష ప్రచారం మొదలు పెట్టింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా 6 రోజులు బ్యాలన్స్ ఉందని, 99 శాతం కచ్చితంగా సెప్టెంబర్ 25 నే వస్తుంది కానీ, అప్పటి లోపు ఈ ఆరు రోజుల షూటింగ్ పూర్తి అవుతుంది అంటూ కొంతమంది పుకార్లు పుట్టించారు. అసలు అభిమానుల్లో ఈ చిత్రం వాయిదా పడుతుంది అనే అనుమానం 0.001 శాతం కూడా లేదు.
కానీ ఈ పుకార్లు పుట్టినచడం వల్ల, వారిలో ఒక రకమైన భయం క్రియేట్ చేయడం లో ఆ మాఫియా గ్యాంగ్ సక్సెస్ అయ్యింది. దీంతో సోషల్ మీడియా మొత్తం ఓజీ సినిమా వాయిదా పడుతుందా ఏంటి?, పవన్ కళ్యాణ్ షూటింగ్ ఇంకా ఆరు రోజులు బ్యాలన్స్ ఉందని అంటున్నారు, ఆయన చూస్తే పొలిటికల్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ అయిపోయాడు, ఇలాంటి కష్టమైన షెడ్యూల్ లో డేట్స్ ఇస్తాడా?, చెప్పిన సమయానికి సినిమా వస్తుందా అంటూ అభిమానులు కంగారు పడ్డారు. ఇది గమనించిన మేకర్స్ వెంటనే స్పందించారు. ఎలాంటి షూటింగ్ బ్యాలన్స్ లేదని, అన్ని రెడీ అయిపోయాయి అని, సెప్టెంబర్ 25 న వస్తున్నాం అంటూ ఒక ట్వీట్ తో అభిమానుల మధ్య గందరగోళాన్ని చెరిపేసారు. దీంతో ఇప్పుడు అభిమానులు శాంతించారు. ఇకపోతే ఈ నెల రోజులు వివిధ రకాల ప్రొమోషన్స్ తో ఫ్యాన్స్ కి ప్రతీ రోజు ఒక థ్రిల్లింగ్ అనుభూతి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక యాక్షన్ టీజర్ ని విడుదల చేయబోతున్నారు.
EVERYTHING IS LOCKED & LOADED…
No more action on the OFF SCREENS…
Sept 25th only on the BIG SCREENS…#OG #TheyCallHimOG pic.twitter.com/wN8de3Cx5x— DVV Entertainment (@DVVMovies) August 25, 2025