https://oktelugu.com/

Allu Arjun : రెమ్యూనరేషన్ విషయంలో షారుఖ్ ఖాన్, ప్రభాస్ లను దాటేసిన అల్లు అర్జున్..’పుష్ప 2′ కి ఎంత తీసుకున్నాడో తెలుసా?

రీజనల్ మార్కెట్ తో ఆ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరో బహుశా ఇండియా లో ఎవ్వరు లేరేమో. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియా లో ఒక్క పెద్ద చర్చ నడుస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 15, 2024 / 08:19 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun :  ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మన టాలీవుడ్ హీరోలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఎంత బాగున్నప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం నువ్వా నేనా అనే రేంజ్ పోటీ వాతావరణం ఉంటుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వీళ్ళందరూ పాన్ ఇండియన్ స్టార్స్ కాబట్టి, వీళ్ళ మధ్య రెమ్యూనరేషన్ దగ్గర నుండే పోటీ ఉంటుంది. ప్రభాస్ ఒక్కో సినిమాకి యావరేజ్ గా 175 నుండి 200 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అదే విధంగా రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి 125 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితే ఈయన కూడా ప్రభాస్ రేంజ్ లో డిమాండ్ చెయ్యొచ్చు. ఎన్టీఆర్ 75 కోట్ల రూపాయిల నుండి 100 కోట్ల రూపాయిల వరకు తీసుకుంటున్నాడని టాక్.

    ఇక పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ కాకపోయినప్పటికీ, ఆయనకు ఓజీ చిత్రానికి 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. రీజనల్ మార్కెట్ తో ఆ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరో బహుశా ఇండియా లో ఎవ్వరు లేరేమో. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియా లో ఒక్క పెద్ద చర్చ నడుస్తుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాకి ఆయన ఏకంగా 300 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. ఇది షారుఖ్ ఖాన్, ప్రభాస్ రెమ్యూనరేషన్స్ ని మించింది. పుష్ప 2 కోసం అన్ని ప్రాంతీయ బాషలకకు సంబంధించిన సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూడడం, దానికి బిజినెస్ కూడా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా జరగడంతో అల్లు అర్జున్ ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ప్రతీ సినిమాకి ఆయనకీ ఇదే రేంజ్ రెమ్యూనరేషన్ ఉండకపోవచ్చు.

    బిజినెస్ కి తగ్గట్టుగా ఆయన నిర్మాతల వద్ద రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తాడట. అన్ని సినిమాలకు పుష్ప 2 రేంజ్ బిజినెస్ జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ‘పుష్ప 2’ అనేది సీక్వెల్. అందుకే ఈ సినిమాకి ఇంత క్రేజ్, ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మళ్ళీ ఈ రేంజ్ బిజినెస్ అల్లు అర్జున్ కి జరగాలంటే సందీప్ వంగ, రాజమౌళి లాంటి డైరెక్టర్స్ తో చేస్తే జరుగుతుంది. అల్లు అర్జున్ తో సందీప్ వంగ చిత్రం ఖరారై చాలా రోజులు అయ్యింది. ఈ సినిమాకి కూడా పుష్ప 2 రేంజ్ బిజినెస్ జరుగుతుంది. దీనికి కూడా ఆయన 300 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమాకి మాత్రం కేవలం 100 కోట్ల రెమ్యూనరేషన్ ని మాత్రమే అందుకోబోతున్నాడని టాక్. చూడాలి మరి భవిష్యత్తులో అల్లు అర్జున్ రేంజ్ ఇంకా ఎంత పెరగబోతుంది అనేది.