https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ కి రెండవసారి మెగా చీఫ్ అయిన అవినాష్..ఎలా అయ్యాడో చూస్తే ఆశ్చర్యపోతారు !

అవినాష్ ఒక వారం మెగా చీఫ్ కూడా అయ్యాడు. ఆయనే ఈ వారం కూడా మెగా చీఫ్ అయ్యినట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. ఫ్యామిలీ వీక్ తర్వాత అవినాష్ మెగా చీఫ్ అవ్వడం వల్ల వచ్చే వారం రోహిణి నామినేషన్స్ లోకి వస్తే ఆమెని సేవ్ చేసే పవర్ అవినాష్ కి రావొచ్చు. టేస్టీ తేజ ని సేవ్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అతనికి మంచి ఓటింగ్. అయితే అవినాష్ ఎలా రెండవసారి మెగా చీఫ్ అయ్యాడు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము

Written By:
  • Vicky
  • , Updated On : November 15, 2024 / 07:57 PM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 కి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఊపిరి గా నిలిచారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొదటి వారం నుండి నాల్గవ వారం వరకు చాలా సాదాసీదాగా ఈ సీజన్ సాగింది. నా తర్వాత పాత సీజన్స్ నుండి వైల్డ్ కార్డ్స్ రావడంతో షో కి ఒక కొత్త కల వచ్చింది. ముఖ్యంగా అవినాష్, టేస్టీ తేజ, రోహిణి చేసే కామెడీ కి టీఆర్ఫీ రేటింగ్స్ అదిరిపోయాయి. అవినాష్ ఒక వారం మెగా చీఫ్ కూడా అయ్యాడు. ఆయనే ఈ వారం కూడా మెగా చీఫ్ అయ్యినట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. ఫ్యామిలీ వీక్ తర్వాత అవినాష్ మెగా చీఫ్ అవ్వడం వల్ల వచ్చే వారం రోహిణి నామినేషన్స్ లోకి వస్తే ఆమెని సేవ్ చేసే పవర్ అవినాష్ కి రావొచ్చు. టేస్టీ తేజ ని సేవ్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అతనికి మంచి ఓటింగ్. అయితే అవినాష్ ఎలా రెండవసారి మెగా చీఫ్ అయ్యాడు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కి ముందు పృథ్వీ, నబీల్ కి మధ్య మెగా చీఫ్ అయ్యేందుకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ‘ఐ యామ్ మెగా చీఫ్’ కి సంబంధించిన అక్షరాలను కొన్ని అడ్డంకులోను ఛేదించి తీసుకొని, వాటిని ఒక క్రమ పద్దతిలో అమర్చాలి. అలా ఎవరైతే కరెక్ట్ గా, వేగంగా అమరుస్తారో వాళ్ళు మెగా చీఫ్ అవుతారు. నబీల్ మెగా చీఫ్ అయిన పక్క రోజే హౌస్ లోకి 8 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. మొత్తం 16 మంది ఇంటి సబ్యులకు మెగా చీఫ్ అయిన ఏకైక కంటెస్టెంట్ గా నబీల్ నిలుస్తాడు. అప్పుడు పెట్టిన టాస్కు లాంటిదే ఇప్పుడు కూడా పెట్టారట. ‘మెగా చీఫ్’ అనే పాదాలకు అక్షరాలను సరైన పద్దతిలో అమర్చి అవినాష్ రెండవసారి మెగా చీఫ్ అయ్యాడు.

    హౌస్ లో మొదటి వారం నుండి ఉంటూ వచ్చిన నిఖిల్, యష్మీ, పృథ్వీ వంటి వారు ఇప్పటి వరకు మెగా చీఫ్ అవ్వలేదు. అలాంటిది అవినాష్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టి రెండు సార్లు మెగా చీఫ్ అవ్వడం చిన్న విషయమైతే కాదు. అందరితో స్నేహంగా ఉండడం, టాస్కులు బాగా ఆడడం, ఎంటర్టైన్మెంట్ ని అందించడం వల్ల అవినాష్ కి హౌస్ మేట్స్ అందరి నుండి ఎక్కువగా సపోర్టు లభిస్తుంది. అయితే ఆడియన్స్ నుండి ఆయనకీ అదే రేంజ్ సపోర్టు ఉందా లేదా అనేది ప్రస్తుతానికి అనుమానమే. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అవినాష్ కి అందరి కంటే ఈ వారం తక్కువ ఓట్లు వచ్చాయట. ఎవరైతే అవినాష్ కామెడీ ని ఇష్టపడతారో వాళ్ళు వెంటనే అవినాష్ కి ఓట్లు వేయండి. పోలింగ్ లైన్స్ మరికాసేపట్లో క్లోజ్ అవ్వనుంది.