Allu Arjun Health: హీరో అల్లు అర్జున్ అనారోగ్యం పాలైనట్లు సమాచారం. ఈ మేరకు ఓ షాకింగ్ న్యూస్ అందుబాటులోకి వస్తుంది. పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 2024 ఆగస్టు 15న పుష్ప 2 విడుదల తేదీగా ప్రకటించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్స్ లో పుష్ప 2 చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. పుష్ప 2పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. 2021లో విడుదలైన పుష్ప బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ముఖ్యంగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన హిందీ వెర్షన్ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. నార్త్ లో అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదు. అంచనాలు నేపథ్యంలో పుష్ప 2 బడ్జెట్ రూ. 350 కోట్లకు చేర్చారు. పార్ట్ 1 కి మించి పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ రేసుగుర్రంలా పరిగెడుతుండగా… షార్ట్ బ్రేక్ పడినట్లు సమాచారం. అల్లు అర్జున్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో షూటింగ్ తాత్కాలింగా ఆపేశారట.
అల్లు అర్జున్ తాజా షెడ్యూల్ లో ఓ ఐటెం సాంగ్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందట. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయట. అయితే సడన్ గా అల్లు అర్జున్ అస్వస్థతకు గురయ్యారట. దాంతో యూనిట్ షూటింగ్ ఆపేశారట. ఆయన కోలుకున్న వెంటనే తిరిగి షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు వేయడానికి వచ్చిన అల్లు అర్జున్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. అల్లు అర్జున్ అస్వస్థతకు గురయ్యారన్న న్యూస్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తుంది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. పుష్ప 2 చిత్ర దర్శకుడు సుకుమార్ కాగా వీరి కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం ఇది. అల్లు అర్జున్ కి ఫస్ట్ హిట్ ఆర్య తో సుకుమార్ ఇచ్చాడు. ఆర్య మూవీతో అల్లు అర్జున్ ఫేమ్ తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్-సుకుమార్ లది బ్లాక్ బస్టర్ కాంబోగా ఉంది.