Allu Arjun Atlee Movie Update: ‘పుష్ప 2’ వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కొంత గ్యాప్ తీసుకొని తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తో సినిమాని మొదలెట్టి, గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ చేస్తున్నాడు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, ఇందులో ఏకంగా 5 మంది హీరోయిన్స్ ఉంటారని, అందులో దీపికా పదుకొనే మెయిన్ హీరోయిన్ కాగా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి వారు ఇతర హీరోయిన్స్ గా నటిస్తున్నారని, నేషనల్ క్రష్ రష్మిక మందన ఇందులో విలన్ క్యాట్రాక్టర్ చేస్తుందని, 5వ హీరోయిన్ గా కొత్త అమ్మాయికి ఛాన్స్ ఇస్తారని, ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా లో వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తని చూసి అభిమానుల్లో చిన్నపాటి గుబులు మొదలైందట.
Also Read: మహేష్, రాజమౌళి #GlobeTrotter టైటిల్ సాంగ్ వచ్చేసింది.. కీరవాణి విశ్వరూపం మామూలుగా లేదు!
ఎందుకంటే డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ అంచనాలకు అసలు చేరుకోవడం లేదట. ఈ చిత్రం రెండు గ్రహాల నేపథ్యం లో నేరకెక్కుతుంది. ఇందులో టైం మెషిన్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఈ కథని వివరించిన తర్వాత నాకే అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది, ఇక ఆడియన్స్ ఈ చిత్రాన్ని అర్థం చేసుకోగలరా?, సినిమా బ్యాక్ ఫైర్ అవుతుందేమో అనే భయం అల్లు అర్జున్ లో మొదలైందట. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఇలాంటి చిత్రాలను ఆదరిస్తారా?, వాళ్లకు ఈ సినిమా అర్థం అవుతుందా అనే సందేహాలు ఆయనలో ఉన్నాయట. ఇదంతా పక్కన పెడితే కొన్ని సన్నివేశాలు అల్లు అర్జున్ కి నచ్చకపోవడం తో, తనకు ఇష్టమైన ఒక టాప్ డైరెక్టర్ ని పిలిపించి షూటింగ్ లొకేషన్ లో రీ షూటంగ్ చేయించుకుంటున్నాడట. ఈ రూమర్ కూడా సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. అంతే కాకుండా అట్లీ ప్రతీ సన్నివేశానికి చాలా సమయం తీసుకుంటున్నాడట. ఆయన టేకింగ్ ని చూస్తుంటే ఈ చిత్రం పూర్తి అవ్వడానికి కనీసం మూడేళ్ళ సమయం పట్టేలా ఉంది. అప్పటికి అల్లు అర్జున్ కమిట్ అయినా సినిమాలు దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద అట్లీ పరంగా అయితే అల్లు అర్జున్ సంతోషంగా, సంతృప్తి కరంగా లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.