Gujarat: అతడి పేరు సయ్యద్..వయసు 30 సంవత్సరాలు.. ఖమ్మంలో పుట్టాడు. ఆ తర్వాత ఎంబిబిఎస్ చేయడానికి చైనా దాకా వెళ్ళాడు. చైనాలో ఆ కోర్స్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చాడు. హైదరాబాదులో టోలిచౌక్ ప్రాంతంలో యునాని వైద్యుడిగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఎంబిబిఎస్ పూర్తి చేసిన వ్యక్తి.. ఇండియాకు వచ్చిన తర్వాత ఐఎంఏ పెట్టే పరీక్షను రాయాలి. అందులో ఉత్తీర్ణత సాధించాలి. అలా అయితేనే అతడికి ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లభిస్తుంది. కానీ సయ్యద్ ప్లాన్ వేరే ఉంది.. వాస్తవానికి ఎంబిబిఎస్ పూర్తి చేసిన వ్యక్తి యునాని ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లేదు. కానీ సయ్యద్ అలా కాకుండా టోలిచౌక్ ప్రాంతంలో యునాని వైద్యుడిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు కార్వాన్ ప్రాంతంలో శవర్మ సెంటర్ ఏర్పాటు చేశాడు.. అక్కడ ఆ హోటల్ నిర్వహిస్తుండగానే తన మకాం రాజేంద్రనగర్ కు మార్చాడు..
రాజేంద్రనగర్ ఏరియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. భూములు అమ్మడం, కొనడం వంటివి చేశాడు. ఇలా భిన్న రూపాలలో పనులు చేస్తున్న అతడు ఒక్కసారిగా తన అసలు ముఖాన్ని చూపించాడు. కాకపోతే ఈసారి అతడు రాజస్థాన్ రాష్ట్రానికి వెళ్ళాడు.. అతడు అనుకున్నట్టు జరిగితే.. ఈపాటికి మన దేశంలో మారణ హోమం ఒక స్థాయిలో జరిగి ఉండేది. రాజస్థాన్ రాష్ట్రంలో టోల్ ప్లాజా వద్ద అతడికారును పోలీసులు తనిఖీ చేశారు. అందులో కొన్ని రకాల తుపాకులు, తూటాలు పోలీసులకు లభ్యమయ్యాయి. ఆ తర్వాత ఒక క్యాన్ లో నాలుగు లీటర్ల ఆముదం నూనె పోలీసులకు కనిపించింది. వాస్తవానికి ఆముదం నూనె దొరకడం పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దీని గురించి సయ్యద్ ను పోలీసులు ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పాడు. ఈ నేపథ్యంలో పోలీసులు తమదైన స్టైల్ లో అతడిని విచారించగా అసలు విషయం చెప్పాడు. ఆముదాన్ని శుద్ధిచేసి రైసిన్ అనే అత్యంత ప్రమాదకరమైన పదార్థాన్ని తయారుచేసి.. దేశంలోని అత్యంత జన సమర్థమైన ప్రాంతాలలో దానిద్వారా బయో వార్ కు రూపకల్పన చేసినట్టు సయ్యద్ అంగీకరించాడు.
ఉత్తరప్రదేశ్, ఇతర ప్రాంతాలకు చెందిన యువకులను సయ్యద్ రిక్రూట్ చేసుకున్నాడు. సయ్యద్ కు ఐసీస్ కోరసాన్ ముఠా తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి సలహాల మేరకు ఆముదపు నూనె నుంచి రైసీన్ అనే విషాన్ని తయారు చేశాడు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి వెళ్లి డ్రోన్ ద్వారా రకరకాల పిస్టల్స్, మందు గుండు సామగ్రిని స్వీకరించాడు. అవన్నీ కూడా పాకిస్తాన్ దేశం నుంచి ఇతడికి వచ్చాయి.. పాకిస్తాన్ దేశంలో ఉన్న కొంతమంది ఉగ్రవాదులు మనదేశంలో దారుణాలకు పాల్పడేందుకు సయ్యద్ లాంటి డాక్టర్లను నియమించుకొన్నారు. సయ్యద్ ఎంబిబిఎస్ చదివి యునానీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.. ఆ తర్వాత షవర్మ సెంటర్ ఏర్పాటు చేశాడు. చివరికి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారిపోయాడు. ఇన్ని ముఖాలను అతడు ప్రదర్శించడానికి ప్రధాన కారణం.. ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా ఉండడానికే.. తను అనుకున్నది చేశాడు.. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఎక్కడో ఖమ్మంలో పుట్టిన అతడు ఇంతటి ప్రయాణం చేశాడు. అయితే ఈ ప్రయాణం అతడి ఎదుగుదలకు తోడ్పడితే బాగుండేది. వినాశనానికి అతడు సిద్ధమయ్యాడు కాబట్టే.. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. అతని ఉగ్ర నెట్వర్క్ పోలీసులు చేదించే పనిలో పడ్డారు.