Allu Arjun: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలు వాళ్ళ ఓన్ స్టైల్ తో ఎదుగుతూ ఉంటారు. కొన్ని సీన్లలో పండించే హావభావాలు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరూ చేయలేరు అనేంత గా గుర్తింపును సంపాదించుకుంటారు…ఇక వీళ్లు వీళ్ళ ఓన్ స్టైల్ లో దూసుకుపోతుంటే మరి కొంతమంది హీరోలు మాత్రం పక్క హీరో లా స్టైల్ ని ఫాలో అవుతూ సక్సెస్ ఫుల్ హీరోలుగా ఎదగాలని చూస్తూ ఉంటారు. ఇక ఈ ప్రాసెస్ లో కొంతమంది సక్సెస్ అవుతుంటే, మరి కొంత మంది మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో మహేష్ బాబు తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని సంపాదించుకోవడమే కాకుండా నటుడిగా కూడా తన స్థాయి ఏంటో తెలుగు ప్రేక్షకులందరికీ చూపించాడు…
ఇక తెలుగులో మరో స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ మాత్రం మహేష్ బాబు ఏది చేస్తే తను కూడా అదే చేస్తూ వస్తున్నాడు. ఇక నటనలో కూడా కొన్ని కొన్ని సీన్లలో మహేష్ బాబుని ఇమిటేట్ చేసినట్టుగా నటిస్తూ ఉంటాడు అని పలువురు సినీ మేధావులు సైతం తెలియజేయడం విశేషం… ఇక నటన పరంగా ఆయన చేసిన జులాయి సినిమా నుంచి మొన్న వచ్చిన పుష్ప సినిమా దాకా అల్లు అర్జున్ ఏదో ఒక చిన్న సీన్ లో మహేష్ బాబుని ఇమిటేట్ చేస్తూ హావా భావాలని అతని లాగా పలికించాలనే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నాడు…
ఇక నటన పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా అల్లు అర్జున్ మహేష్ బాబు ని ఫాలో అవుతూ ఉంటాడు అనేది చాలామంది చెప్పే మాట. ఆయన ఏ ఎం బి మాల్ కట్టించుకున్నాడు అని అల్లు అర్జున్ కూడా సత్యం ఏషియన్ త్రిబుల్ ఏ ని చాలా ఇష్టంగా కట్టించుకున్నాడు.
అలాగే మహేష్ బాబు తీసుకున్న కొన్ని కార్ల ను కూడా అల్లు అర్జున్ తెప్పించుకున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా అభిమానుల్లో వీళ్లిద్దరూ కూడా మంచి స్థానాన్ని సంపాదించుకోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…