Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఈమేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి సీతారాములకు కానుకలు అందుతున్నాయి. ఆలయ ప్రారంభత్సోవం, రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు ఇప్పటికే శుభ ముహూర్తం నిర్ణయించారు. ప్రాణ ప్రతిష్ఠ ప్రధాన కార్యక్రమం 2024, జనవరి 22న మధ్యాహ్నం 12:20 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోదీతోపాటు ప్రముఖ క్రీడాకారులు, సినీ తారలు, ఆధ్యాత్మిక ప్రతినిధులు, వ్యాపారులు, సాధువులు హాజరు కానునానరు.
22నే ఎందుకు?
హిందూ పురాణాల ప్రకారం అభిజిత్ ముహూర్తం, మృగశిర నక్షత్రం, అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగాల సంగమ సమయంలో జగదబి రాముడు జన్మించాడు. ఈ పవిత్రమైన కాలాలన్నీ 2024, జనవరి 22న సమలేఖనం అవుతున్నాయి. ఈ కాలం రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠకు లేదా అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపనకు అనువుగా ఉంటుందని భావించారు.
అభిజిత్ ముహూర్తం
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. అభిజిత్ ముహూర్తం రోజులో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన సమయం. ఇది దాదాపు 48 నిమిషాలు ఉంటుంది. 2024, జనవరి 22న, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:16 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:59కి ముగుస్తుంది. ఈ కాలంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. హిందువులకు ఇది శుభ సమయం. అందుకే హిందూ పురాణాల ప్రకారం, ఈ కాలం ఒకరి జీవితం నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది.
మృగశిర నక్షత్రం
ఇక జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మృగశిర 27 నక్షత్రాల్లో ఐదవది. ఇది ఓరియోనిస్ రాశిని సూచిస్తుంది. మృగశిర అంటే జింక తల. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మంచి రూపాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. తెలివైనవారు, శ్రీరాముడు ఈ నక్షత్రంలోనే జర్మించాడు. రాక్షసులు అమరత్వం కోసం మృగశీర నక్షత్రాన్ని పాలించే గ్రహం అయిన సోమను అపహరించి కమలంలో దాచిపెట్టారు. దేవతలు సహాయం కోసం జింకల రాజు మృగశీరను సంప్రదించారు. అతను చివరికి సోమను విడిపించాడు. 2024, జనవరి 22న, మృగశీర నక్షత్రం ఉదయం 3:52 గంటలకు ప్రారంభం అవుతుంది. జనవరి 7:13 వరకు కొనసాగుతుంది.
అమృత సిద్ధియోగ, సర్వార్థ సిద్ధియోగ..
జ్యోతిషశాస్త్రంలో.. నక్షత్రం, వారం రోజుల కలయిక ఒక శుభ కాలం ఏర్పడటానికి దారితీస్తుంది. మృగశీర, సోమవారం (జనవరి 22) కలయిక అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం శుభ కాలాలను ఏర్పరుస్తుంది. ఇది సోమవారం ఉదయం 07:13కి ప్రారంభమవుతుంది, మంగళవారం ఉదయం 04:58 వరకు కొనసాగుతుంది.
గంటపాటు యాగం..
రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు ముందు గంటపాటు యాగం, హవనం, నాలుగు వేదాల పారాయణం, ఇతర కర్మలు నిర్వహిస్తారు. ఈ ముహూర్తంలోని 16 గణాలలో పది మంచివిగా పరిగణిస్తారు.